Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
వ్యాధినిరోధక శక్తిని పెంపు, ఎముకలకు కొండంత బలం..హైదరాబాదీ పెళ్లిళ్ల స్పెషల్ మటన్ మరాగ్
హైదరాబాదీ పెళ్లి భోజనం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బిర్యానీ. కానీ ఆ బిర్యానీ కంటే ముందుగా అతిథులకు వడ్డించే అద్భుతమైన వంటకం ఒకటుంది. అదే మటన్ మరాగ్. ఇది కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, దశాబ్దాలుగా వస్తున్న ఒక మధురమైన సాంప్రదాయం. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే లేత మటన్ ముక్కలు, కమ్మటి సువాసనలతో కూడిన ఈ సూప్ లేకుండా హైదరాబాదీ వివాహాలు అసంపూర్ణమనే చెప్పాలి. మటన్ మరాగ్ పర్ఫెక్ట్ గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

మటన్ మరాగ్ తయారీకి కావలసిన పదార్థాలు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
యాలకులు - 4 లేదా 5
లవంగాలు - 4 లేదా 5
మిరియాలు - అర టీస్పూన్
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
లేత మటన్- 750 గ్రాములు
ఉప్పు - 2 టీస్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
పసుపు - అర టీస్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ - 1 టీస్పూన్
బాదం పప్పులు- 15 నుండి 20
జీడిపప్పులు - 15 నుండి 20
పాలు - 1 కప్పు
పెరుగు - 1/3 కప్పు
ఫ్రెష్ క్రీమ్ - 1/3 కప్పు
గరం మసాలా పొడి - పావు టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
నీళ్లు - తగినన్ని
మటన్ మరాగ్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక యాలకులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మెత్తబడితే చాలు, గోధుమ రంగులోకి మారకూడదు.
-ఇప్పుడు అందులో శుభ్రం చేసుకున్న మటన్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఒక కప్పు నీళ్లు పోసి కుక్కర్ మూతపెట్టాలి. హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి, ఆ తర్వాత మంటను సిమ్ లో ఉంచి 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి.
-మటన్ చాలా మెత్తగా ఉడికిపోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వేరొక పెద్ద గిన్నెలోకి మార్చుకోవాలి.
-ఈలోపు మిక్సీ జార్ లో పొట్టు తీసిన బాదం, జీడిపప్పు, ఒక కప్పు పాలు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి. ఉడుకుతున్న మటన్ లో ఈ బాదం జీడిపప్పు పేస్ట్, పెరుగు, ఫ్రెష్ క్రీమ్, 750 మి.లీ నీళ్లు పోసి బాగా కలపాలి. మూతపెట్టి సన్నని మంట మీద మరో 10 నిమిషాల పాటు ఉడికించాలి.
-చివరగా గరం మసాలా పొడి, దంచిన మిరియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి. మీకు సూప్ లాగా పలుచగా కావాలంటే మరికొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. ఇలా మరో 8-10 నిమిషాలు సిమ్ లో ఉడికిస్తే గుమగుమలాడే మటన్ మరాగ్ రెడీ.
-దీన్ని వేడివేడిగా నాన్, పావ్ లేదా బ్రెడ్ స్లైస్ లతో కలిపి తింటే ఆ రుచి జన్మలో మర్చిపోలేరు.

ఆరోగ్య ప్రయోజనాలు
వ్యాధినిరోధక శక్తి: మటన్ ఎముకలతో ఉడకబెట్టిన ఈ సూప్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటివి దరిచేరవు.
ఎముకల బలం: మటన్ లో ఉండే క్యాల్షియం, అధిక ప్రోటీన్లు ఎముకలను, కండరాలను దృఢంగా మారుస్తాయి.
తక్షణ శక్తి: ఇందులో వాడే బాదం, జీడిపప్పు, నెయ్యి శరీరానికి మంచి కొవ్వులను అందించి, రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి.
మెరుగైన జీర్ణక్రియ: యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు వంటి మసాలా దినుసులు జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచుతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications