Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
హైదరాబాదీ స్టైల్ ప్లెయిన్ దమ్ బిర్యానీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ వండుకుంటారు!
హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రపంచవ్యాప్తంగా అదొక బ్రాండ్. బిర్యానీ అనగానే సాధారణంగా చికెన్ లేదా మటన్ దమ్ బిర్యానీ గుర్తుకువస్తుంది. కానీ మాంసాహారం తినని వారికి లేదా మాంసాహార గ్రేవీ కర్రీలలోకి (చికెన్ కుర్మా, మటన్ కర్రీ వంటివి)మిర్చీ కా సాలన్ లాంటి వాటికి సరైన కాంబినేషన్‌గా హైదరాబాద్ ప్లెయిన్ దమ్ బిర్యానీ ఎంతగానో ప్రాచుర్యం పొందింది.
బగారా రైస్ ని మించిన టేస్ట్ ఇందులో ఉంటుంది. హైదరాబాదీ స్టైల్ ప్లెయిన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-బాస్మతి బియ్యం
-నీళ్లు
-ఉప్పు
-షాజీరా
-యాలకులు
-లవంగాలు
-దాల్చిన చెక్క
-నూనె
-నిమ్మరసం
-నెయ్యి
-బిర్యానీ ఆకు
-అనాస పువ్వు
-జాపత్రి
-ఉల్లిపాయలు
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-పెరుగు
-పసుపు
-కారం
-గరం మసాలా
-పుదీనా
-కొత్తిమీర

తయారీ విధానం
-ముందుగా 2 కప్పుల బాస్మతి బియ్యంను నీళ్లు పోసి 1 గంటసేపు నానబెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టి అందులో ముప్పావు కప్పు ఆయిల్ పోసి వేడి చేశాక అందులో 1 టేబుల్ స్పూజీ షాజీరా, 1 బిర్యానీ ఆకు, కొంచెం జాపత్రి, 4 యాలకలు 1 మరాఠీ మొగ్గ, 4 లవంగాలు, 2 అంగులాల దాల్చిన చెక్క, కొంచెం రాతి పువ్వు వేసి జస్ట్ పొంగించాలి.
-మసాలాలన్నీ పొంగిన తర్వాత అందులో 1 కప్పు ఉల్లిపాయ చీలికలు వేసి అవి ఎర్రబడేవరకు వేయించుకోండి.
-ఉల్లిపాయ చీలికలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత అందులో ఒకటింబావు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత ఇందులోనే పావు టీస్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 టీస్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి వీటన్నింటిని బాగా కలిపి జస్ట్ పొంగిస్తే చాలు. ఎక్కువగా వేపితే మాడిపోతాయి.
-కారాలు పొంగిన వెంటనే స్టవ్ ఆపేసి గిన్నెలోనే పావు కప్పు పుదీనా తరుగు, పావు కప్పు కొత్తిమీర తరుగు వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి.ఆ వేడికి మగ్గిపోతాయి. తర్వాత అందులోనే అరకప్పు చిలికిన పెరుగు వేసి కలుపుకోండి.ఇందులోనే అర చెక్క నిమ్మరసం పిండి కలిపేసి పక్కన ఉంచుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో రెండున్నర లీటర్ల నీళ్లు పోసి, ఇందులోనే రెండున్నర ఇంచుల దాల్చిన చెక్క, 1 అనాన పువ్వు, 3 యాలకలు, 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, రెండున్నర టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి ఎసరుని 8-10 నిమిషాల పాటు పెద్ద మంట మీద బాగా తెర్లకాగనివ్వాలి.
-ఎసరు తెర్లకాగుతున్నప్పుడు అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి మరో 3 నిమిషాలు మరగనిచ్చాక అందులో కాస్త కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు వేసి ఒక నిమిషం పాటు మరగనివ్వాలి.
-ఇప్పుడు అందులో గంటసేపు నానబెట్టిన రెండు కప్పుల బాస్మతి బియ్యం వేసి పెద్ద మంట 80 శాతం వరకు ఉడికించుకోవాలి(ఇంకో 2-3 నిమిషాలు ఉడకనిస్తే పూర్తిగా ఉడికిపోతుంది అనే స్టేజీ).
-80 శాతం వరకు ఉడికిన అన్నాన్ని వడకట్టి తీసుకొని తయారుచేసి పక్కన పెట్టుకున్న మసాలాలో వెదజల్లుకోండి. అన్నం మొత్తాన్ని ఇలా అందులో వెదజల్లుకోండి.
-ఇప్పుడు బియ్యం ఉడకించిన గంజి నీళ్లు అరకప్పు తీసుకొని అందులో పావు టీస్పూన్ పసుపు వేసి కలిపి ఈ నీటిని అన్నం మీద అలా అలా జల్లుకోండి. అన్నం మీదనే 2 చెంచాల నెయ్యి, కొంచెం పుదీనా తరుగు, 2 చిటికెళ్ల గరం మసాలా చల్లుకొని మూతపెట్టి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి 4 నిమిషాలు పెద్ద మంట మీద, 8 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించి స్టవ్ ఆపేసి అరగంట సేపు అలాగే వదిలేయండి.
-అరగంట తర్వాత మూత తీసి చూస్తే వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications