Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
ఇడ్లీలోకి ఈ కుర్మా చేసుకుంటే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.. టేస్ట్ అదుర్స్!
ఇడ్లీ అనగానే మనకు వెంటనే సాంబార్ లేదా పల్లి చట్నీ, టమోటా చట్నీలే గుర్తొస్తాయి. రోజు మార్చి రోజు ఇవే చేసుకుంటే ఎంత ఇష్టమైన ఇడ్లీ అయినా కాస్త బోర్ కొట్టడం సహజం. అయితే ఈ సారి కాస్త భిన్నంగా, నోటికి అద్భుతమైన రుచి తగిలేలా ఇడ్లీలోకి కుర్మా ట్రై చేయండి.
సాధారణంగా మనం చపాతీ, పూరీల్లోకి కుర్మా చేసుకుంటాం. కానీ ఇడ్లీకి కుర్మా కాంబినేషన్ ఎంత బాగుంటుందో తెలిస్తే వదిలిపెట్టరు. ఈ కమ్మని కుర్మాను ఇడ్లీపై పోసుకుని తింటుంటే.. తెలియకుండానే రోజూ తినేదానికంటే రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు. టేస్టీ ఇడ్లీ కుర్మాను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
నూనె - 1 టేబుల్ స్పూన్
పెద్ద ఉల్లిపాయ - 1
వెల్లుల్లి - 6 రెబ్బలు
అల్లం - 3 చిన్న ముక్కలు
పచ్చిమిర్చి - 5
సోంపు - 1 టీస్పూన్
పచ్చి కొబ్బరి తురుము - 3 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు - 8
నీళ్లు - కొద్దిగా
కుర్మా తయారీకి నూనె - 2 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క - 2 ముక్కలు
లవంగాలు - 5
అనాస పువ్వు - 1
రాతి పువ్వు- కొద్దిగా
బిర్యానీ ఆకులు - 2
టమోటాలు - 2
పసుపు - పావు టీస్పూన్
ధనియాల పొడి - ఒకటిన్నర టీస్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - గ్రేవీకి తగినన్ని
తాజా కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం వేసి పచ్చివాసన పోయేలా దోరగా వేయించాక పచ్చిమిర్చి, సోంపు వేసి బాగా కలపండి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పులు వేసి వేయించి, స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన ఈ పదార్థాలన్నింటినీ మిక్సీ జార్ లో వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయండి. నూనె వేడెక్కాక దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, కల్పాసి, బిర్యానీ ఆకులు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించండి.
-అందులో సన్నగా తరిగిన టమోటా ముక్కలు వేసి, రుచికి సరిపడా ఉప్పు చల్లి, టమోటాలు బాగా మగ్గి మెత్తబడే వరకు ఉడికించండి.
-టమోటాలు గుజ్జుగా మారాక, పసుపు, ధనియాల పొడి వేసి కలపండి. ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న జీడిపప్పు-కొబ్బరి మసాలా పేస్ట్ ను ఇందులో వేసి ఓ నిమిషం పాటు వేయించాలి.
-మసాలా పచ్చివాసన పోయాక కుర్మా మీకు ఎంత చిక్కగా కావాలో చూసుకుని దానికి తగినట్లుగా నీళ్లు పోయండి. ఉప్పు సరిచూసుకుని, మూతపెట్టి సుమారు 10 నిమిషాల పాటు సన్నని మంటపై బాగా మరగనివ్వండి.
-కుర్మా బాగా ఉడికి, నూనె పైకి తేలుతున్న సమయంలో సన్నగా తరిగిన తాజా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోండి.
-అంతే ఎంతో రుచికరమైన ఇడ్లీ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications