Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
Idly Podi: పొద్దున్నే చట్నీలు అక్కర్లేదు..3 నెలలు నిల్వ ఉండే టేస్టీ 'ఇడ్లీ పొడి' ఇలా చేసుకోండి
డైలీ ఒకేరకమైన చట్నీలతో ఇడ్లీ,దోశలు తిని తిని బోర్ కొట్టిందా? చట్నీకి బదులుగా ఏదైనా కొత్తగా కలుపుకొని తినాలని అనిపిస్తుందా? అయితే ఎంతో టేస్టీగా ఉండటంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఇడ్లీ పొడి బెస్ట్ ఆప్షన్. పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ చేసుకుంటే అది కొన్ని గంటలు మాత్రమే నిల్వ ఉంటుంది. అయితే ఇడ్డీ పొడి మాత్రం కొన్ని వారాల పాటు నిల్వ ఉంటుంది. దీనిని చేసుకోవడం చాలా సింపుల్. దాదాపు 3 నెలల వరకు నిల్వ ఉండే ఇడ్లీ పొడిని ఇంట్లోనే చేసుకోడానికి ఏమేం పదార్థాలు కావాలి,దీని తయారీ విధానం ఇక్కడ చూడండి. ఈ ఇడ్లీ పొడి అన్నంతో కూడా అద్భుతంగా ఉంటుంది. మీ మధ్యాహ్న భోజనంలో అన్నంలో ఈ పొడిని కలుపుకొని నెయ్యితో తినవచ్చు.
ఇడ్లీ పొడి తయారీకి కావల్సిన పదార్థాలు
-పచ్చి శెనగపప్పు
-శెనగపప్పు
-నువ్వుల నూనె
-కరివేపాకు
-ఇంగువ
-ఎండు మిర్చి
-మినపప్పు
-నువ్వులు
-ఉప్పు
-వెల్లుల్లి

ఇడ్లీ పొడి తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి ఒక చెంచా నువ్వుల నూనె అందులో పోసి
వేడి చేసుకోండి.
-ఇప్పుడు మంటను లో ప్లేమ్ లో పెట్టి పాన్ లో అరకప్పు పచ్చి శెనగపప్పు వేసి ఎర్రగా రంగు వచ్చేవరకు వేపుకోండి.
-ఇప్పుడు వేగిన శెనగపప్పుని ఓ ప్లేట్ లోకి తీసుకోండి.
-ఇప్పుడు పాన్ లో మిగిలిన నూనెలోనే అరకప్పు మినపప్పు వేసి సన్నని సెగ మీదనే మంచి రంగు వచ్చే వరకు వేపుకోవాలి.
-ఇప్పుడు వేగిన మినపప్పుని కూడా ప్లేట్ లోకి తీసుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో 10-15 కారం ఉండే ఎండు మిర్చి వేయండి.
-మిర్చి వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి చిట్లనివ్వండి.
-నువ్వులు చిట్టిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు(పుట్నాల పప్పు),రెండు రెబ్బల కరివేపాకు వేసి లో ప్లేమ్ మీద వేపుకోండి.
-కరివేపాకులోని చెమ్మ ఆరిపోయేంతవరకు వేపుకున్న తర్వాత పాన్ లోనే రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి.
-ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని కూడా ప్లేట్ లోకి తీసుకండి. అందులోనే రెండు చిటికెళ్లు ఇంగువ వేసి పప్పులన్నీ పూర్తిగా చల్లారనివ్వండి.
-బాగా చల్లారిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోబడిన అన్నింటిని మిక్సీలో వేసి.. కావాలి అనుకుంటే 10 వెల్లుల్లి రెబ్బలు కూడా అందులో వేసి గ్రైండ్ చేయండి. ఇడ్లీ రవ్వ కన్నా సన్నగా ఉండేలా చేసుకోండి. అంతే టేస్టీ ఇడ్లీ పొడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
