Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ చట్నీ తింటే మీ బాడీలో చెడు కొవ్వు ఉండదు, గుండె జబ్బులు కూడా రావు
మారిన జీవన శైలి, మారుతున్న తినే ఆహరం, ఇతర అలవాట్ల కారణంగా ఈ మధ్య కాలంలో గుండె జబ్బులతో మరణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. గుండె సమస్యలు రావడానికి ముఖ్యమైన కారణం చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోవడం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వలన, అధిక రక్తపోటు, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్స్ వంటి వ్యాధులు వస్తున్నాయి. ఈ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి చాలా మంది రకరకాల డైట్స్, వర్క్ ఔట్స్ చేస్తుంటారు. అయితే ఎవరికైతే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయుందో వారు ఈ చట్నీలను తినడం వలన అనేక మంచి ప్రయోజనాలను పొందుతారు. అలాగే వారికి ఎటువంటి ఆరోగ్య సమస్య కూడా రాదు. ఆ చట్నీలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పుదీనా పచ్చడి
పుదీనా పచ్చడిలో ఫైబర్, క్లోరోఫిల్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు ఉపయోగకరంగా ఉంటాయి. ఈ పచ్చడిని తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. రోజుకు ఒకసారి ఈ పచ్చడిని మీ డైట్‌లో చేర్చుకోవడం మంచిది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి, శరీరంలో ఉండే చెడు కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి.

మెంతికూర పచ్చడి
మెంతి ఆకులతో తయారు చేసిన పచ్చడిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. మెంతి పచ్చడిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. శరీరాన్ని చల్లబరుస్తుంది. దీనితో పాటు మీరు మెంతి ఆకులతో పచ్చడి మాత్రమే కాకుండా పలు వంటలు కూడా చేసుకోవచ్చు.
పాలకూర పచ్చడి
పాలకూరలో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ధమనుల్లో రక్తగడ్డలు ఏర్పడకుండా చేస్తుంది. పాలకూర ఆకులు, కొత్తిమీర, పుదీనా కలిపి ఈ చట్నీ తయారుచేయవచ్చు.
బతువా చట్నీ
బతువాలో ఉన్న ఫైబర్, రఫ్టేజ్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు, అలాగే జీర్ణవ్యవస్థను కూడా సక్రమంగా ఉంచుకోవచ్చు.
కరివేపాకు చట్నీ
కరివేపాకులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధ గుణాలు చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడతాయి. ఈ చట్నీ కూరగాయల్లో చేర్చుకొని తయారుచేసి తినవచ్చు. అలాగే నేరుగా కరివేపాకుతో పచ్చడి చేసుకొని కూడా తీసుకోవచ్చు.
మీ బ్రేక్ ఫాస్ట్‌కి దోశ, ఇడ్లీ, ఉప్మా వంటివి ఈ చట్నీలతో తినడం ద్వారా మీరు మంచి బలీష్టమైన ఆరోగ్యాన్ని పొందగలుగుతారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications