బరువు తగ్గాలనుకుంటున్నారా? బియ్యం లేకుండా ఇలా హెల్దీ ఇడ్లీ చేసుకోండి..షుగర్ పేషెంట్లకు మంచిది!

Posted By:

ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇడ్లీ, దోశలు తిని బోర్ కొట్టిందా? అయితే ఓసారి పెసరపప్పు ఇడ్లీ ట్రై చేయాల్సిందే. సాధారణంగా మనం బియ్యం, మినపప్పుతో ఇడ్లీలు చేసుకుంటాం.

అయితే బియ్యం లేకుండా కేవలం పెసరపప్పుతో చేసే ఈ ఇడ్లీలు రుచిలోనూ, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ సాంప్రదాయ ఇడ్లీల కంటే చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ పేషెంట్లకు ఇది ఒక చక్కటి ఆహారం. మరి అంతటి రుచికరమైన, పోషకాల గని అయిన ఈ పెసరపప్పు ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Instant and Healthy A Quick Guide to Making Protein Rich Moong Dal Idli Recipe in Telugu

కావలసిన పదార్థాలు
పెసరపప్పు- 1 కప్పు
పెరుగు - అర కప్పు
తురిమిన క్యారెట్ - పావు కప్పు
పచ్చిమిర్చి - 2
అల్లం తురుము - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
వంట సోడా - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె- 1 స్పూన్
ఆవాలు-కొద్దిగా
జీలకర్ర- కొద్దిగా
ఇంగువ-చిటికెడు
కరివేపాకు-కొంచెం
పసుపు- కొంచెం

తయారీ విధానం

-ముందుగా ఒక కప్పు పెసరపప్పును శుభ్రంగా కడిగి సుమారు 2 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. పెసరపప్పు త్వరగా నానుతుంది కాబట్టి ఎక్కువ సమయం అవసరం లేదు.

-నానిన పెసరపప్పులో నీటిని వడకట్టి గ్రైండర్ లేదా మిక్సీ జార్‌ లో వేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు చేర్చి మెత్తని పేస్ట్‌ లా రుబ్బుకోవాలి. పిండి మరీ జారుగా కాకుండా, ఇడ్లీ పిండిలా గట్టిగా ఉండేలా చూసుకోవాలి.

-రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో పెరుగు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం తురుము, తురిమిన క్యారెట్, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇడ్లీలు మృదువుగా రావడానికి చిటికెడు వంట సోడా కలపవచ్చు.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టుకుని నూనె వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, చిటికెడు పసుపు వేసి వేయించాలి. ఈ పోపును ఇడ్లీ పిండిలో వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. పోపు వల్ల ఇడ్లీకి అద్భుతమైన రుచి వస్తుంది.

-ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి, సిద్ధం చేసుకున్న పిండిని ప్లేట్లలో వేయాలి. ఇడ్లీ కుక్కర్ లేదా స్టీమర్‌ లో నీరు పోసి, ఈ ప్లేట్లను ఉంచి 10 నుండి 12 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి.

-10 నిమిషాల తర్వాత ఒక టూత్‌ పిక్ లేదా చాకుతో ఇడ్లీ మధ్యలో గుచ్చి చూడండి. పిండి అంటుకోకుండా శుభ్రంగా బయటకు వస్తే ఇడ్లీలు ఉడికినట్టే.

-స్టవ్ ఆఫ్ చేసి, వేడివేడి పెసరపప్పు ఇడ్లీలను ప్లేట్‌ లోకి తీసుకోండి. దీనిని అల్లం పచ్చడి, కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌ తో తింటే ఆ రుచే వేరు.

[ of 5 - Users]
Story first published: Wednesday, February 4, 2026, 6:57 [IST]
Desktop Bottom Promotion