Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
Instant breakfast recipe: 10 నిమిషాల్లో చేసుకునే ఇన్ స్టంట్ బ్రేక్ ఫాస్ట్..గుంత పొంగనాలు విత్ చట్నీ
పొద్దున్నే మన ఇళ్లల్లో సాధారణంగా ఉండే బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ,దోశ లేదా పూరీ. అయితే వీటిని చేయడానికి కొంచెం టైం పడుతుంది. కేవలం 10 నిమిషాల్లో రెడీ చేసుకునే ఇన్ స్టంట్ గుంతపొంగనాలు ఓసారి ట్రై చేయండి. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలనిపించే గుంతపొంనాలు విత్ చట్నీని ఎలా తయారుచేసుకోవాలి,దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూడండి.
గుంత పొంగనాలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-బొంబాయి రవ్వ
-ఉల్లిపాయ
-క్యారెట్
-పచ్చిమిర్చి
-క్యాప్సికమ్
-కొత్తిమీర
-ఉప్పు
-టమాటో
-వంట సోడా
-నిమ్మకాయ
-పెరుగు
-జీలకర్ర
-పసుపు
-ఆవాలు
-వెల్లుల్లి
-ఇంగువ
-కరివేపాకు
-కొబ్బరి
-పుట్నాల పప్పు(శనగపప్పు)
-పచ్చి శెనగనపప్పు
-ఎండు మిర్చి

గుంత పొంగనాలు,చట్నీ తయారీ విధానం
-ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో.. ఒక కప్పు సన్న బొంబాయి రవ్వ,అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు,సన్నగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి,చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ టమాటో,తరుముకున్న క్యారెట్ పావు కప్పు,చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కలు,సన్నగా తరిగిన కొత్తిమీర 2 టేబుల్ స్పూన్స్,రుచికి తగినంత ఉప్పు,పావు టీ స్పూన్ వంట సోడా వేసి బాగా కలపండి.
-తర్వాత అందులోనే ఒక అరకప్పు పెరుగు కూడా వేసి,కొంచెం కొంచెంగా కొన్ని నీళ్లు పోసి బాగా కలపి మూత పెట్టేసి 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి.
-తర్వాత మిక్సీ గిన్నెలో సన్నగా కట్ చేసిన అరకప్పు కొబ్బరి ముక్కలు,1/4 ఇంచు కట్ చేసిన అల్లం,2 టేబుల్ స్పూన్ల పుట్నాలు, ముక్కలు చేసిన 2 పచ్చిమిర్చి,1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర,1 చిన్న సైజ్ ఉల్లిపాయలను ముక్కలు,రుచికి సరిపడా ఉప్పు,కొంచెం నీళ్లు,ఒక బద్ద నిమ్మరసం కూడా పిండి బాగా పోసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత ఈ చట్నీ ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం నూనె పోసి అందులో ఆవాలు,మినపప్పు,జీలకర్ర,పచ్చి శెనగపప్పు,కరివేపాకు,ఎండుమిర్చి,కొద్దిగా ఇంగువ,వెల్లుల్లి వేసి దోరగా వేయించి ఆ తర్వాత ఈ మెత్తాన్ని చట్నీలో వేసి కలపితే చట్నీ రెడీ.
-తర్వాత స్టవ్ మీద మరో పాన్ పెట్టి అందులో అర టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఇంగువ, చిటికెడు పసుపు,1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసి దోరగా వేయించండి. తర్వాత దీన్ని బౌల్ లో కలిపిపెట్టి ఉంచిన పొంగనాల పిండిలో వేసి బాగా కలపాలి.
-తర్వాత స్టవ్ మీద అప్పం పాన్ పెట్టి కొంచెం వేడయ్యాక అందులోని అన్నీ గుంతల్లో కొంచెం కొంచెం ఆయిల్ వేయండి.
-ఆయిల్ వేడెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న గుంత పొంగనాల పిండిని అందులో ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేయండి. 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసి గుంతపొంగనాలను రెండో వైపుకి తిప్పి వేడి చేయండి.క్రిస్పీ గుంతపొంగనాలు రెడీ. వీటిని ఓ ప్లేట్ లోకి తీసుకొని రెడీ చేసుకున్న చట్నీతో తింటుంటే మైమరచిపోయి ఆహా ఏమి రుచిరా అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications