Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రెండు నిమిషాల్లో రెడీ అయిపోయే ఇన్‌స్టంట్ దోశ.. సింపుల్‌గా ఎలా చేసుకోవాలో తెలుసా?
ప్రతిరోజూ ఉదయం లేవగానే టిఫిన్ ఏం చేయాలనేది పెద్ద తలనొప్పిగా మారుతుంటుంది. కొందరికి దోష ఇష్టమైతే ఇంకొందరికి ఇడ్లీ, మరికొందరికి బోండా ఇష్టం ఉంటుంది. ఇంకొందరికి తినే సమయం లేకపోవడంతో తొందరగా ఏదైతే అది అని అనుకుంటూ ఉంటారు. అయితే వందలో 99 మందికి ఇష్టముండే ఇన్‌స్టంట్ దోశను మాత్రం ఎవరూ కాదనరు. ఇది రుచికరంగా ఉండడంతో పాటు క్షణాల్లోనే దీన్ని తయారుచేసుకోవచ్చు. పెద్దగా కష్టపడకుండా చేసుకునే ఈ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఏ విధంగా దీన్ని చేసుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇన్‌స్టంట్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు..
- రెండు చెంచాల బియ్యం పిండి
- రెండు చెంచాల గోధుమ పిండి
- ఒక కప్పు సెమోలినా
- ఒక కప్పు పెరుగు
- ఉప్పు రుచికి సరిపడా
- కొద్దిగా నీళ్లు
- కొద్దిగా బేకింగ్ సోడా

ఇన్‌స్టంట్ దోశ తయారీ విధానం
ఈ ఇన్‌స్టంట్ దోశను తయారుచేసుకోవడానికి ముందుగా ఒక మిస్కి జార్ తీసుకొని అందులో సెమోలినా, బియ్యంపిండి, గోధుమ పిండి, పెరుగు వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. పిండి మరీ పలచగా ఉండకుండా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో రెండు స్పూన్ల నూనె, రుచికి సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా కలుపుకోవాలి. తరువాత ఒక అరగంట పాటు ఆ మూతపై తడి గుడ్డ పెట్టుకొని అలానే కదలకుండా ఉంచుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టుకోవాలి. దానిపై ఉల్లిపాయతో నూనెను పెనం మొత్తం సమాంతరంగా పోసుకోవాలి. నూనె కొంచెం వేడిక్కాక దానిపై కొంచెం మందంగా, కొంచెం ఒత్తుగా దోశను వేసుకోవాలి. అలా మందంగా వేసుకుంటేనే ఇన్‌స్టంట్ దోశ రుచికరంగా ఉంటుంది. దోశ ఒకవైపు కాలే సమయంలోనే దానిపై కొంచెం నూనె కూడా పోసుకోవాలి. అలాగే కారంగా కావాలనుకుంటే కొంచెం కారం వేసుకుకున్నా పర్వాలేదు.
ఉల్లిపాయ కావాలనుకున్న వ్యక్తులు ఉల్లిపాయలను కూడా జత చేసుకోవచ్చు. ఒకవైపు దోష పూర్తిగా కాలిన తరువాత దానిని మెల్లగా ఇంకోవైపు తిప్పుకొని మాడిపోకుండా కొంచెం కొంచెంగా కాల్చుకోవాలి. ఆ దోశను ఒక అరటి ఆకుమీద పెట్టుకొని ఇంకో నాలుగైదు దోశలను వేసుకోవాలి. అంతే ఎంతో రుచికరంగా క్షణాల్లోనే సిద్ధమైపోయే ఇన్‌స్టంట్ దోశ సిద్ధమైపోతుంది.
ఈ దోశను పల్లి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్ వంటివాటితో తింటే రుచి అమోఘంగా ఉంటుంది. అలాగే ఇందులో మనం సెమోలినా కలుపుతాం కాబట్టి.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పల్లి మీరు కూడా క్షణాల్లోనే సిద్ధమైపోయే టిఫిన్ గురించి ఆలోచిస్తుంటే ఈసారి ఈ ఇన్‌స్టంట్ దోశను ట్రై చేయండి. అలాగే ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications