Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
ఇడ్లీ పిండి లేదని టెన్షన్ పడుతున్నారా? అప్పటికప్పుడు చేసుకునే మజ్జిగ ఇడ్లీ రెసిపీ ఇదే!
సాధారణంగా మనం మినపప్పు, బియ్యం రవ్వతో ఇడ్లీలు వేసుకుంటాం. ఇడ్లీలలో గోలీ ఇడ్లీ, ఖుష్బూ ఇడ్లీ, తట్టే ఇడ్లీ, కప్పు ఇడ్లీ, మల్లెపువ్వు లాంటి మృదువైన ఇడ్లీ, రవ్వ ఇడ్లీ.. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే కొన్నిసార్లు పిండి రుబ్బడం మర్చిపోతాం లేదా అప్పటికప్పుడు ఏదైనా కొత్తగా తినాలనిపిస్తుంది. అలాంటి సమయాల్లో బెస్ట్ ఆప్షన్ మజ్జిగ ఇడ్లీ.
ఈ మజ్జిగ ఇడ్లీ చాలా మృదువుగా, స్పాంజిలా ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే..దీనికోసం ముందు రోజు పప్పు నానబెట్టడం, పిండి రుబ్బడం, రాత్రంతా పులియబెట్టడం వంటి పనులేవీ అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉండే పదార్థాలతో అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. రుచికరమైన, సులభమైన మజ్జిగ ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ - 2 కప్పులు
అటుకులు - ముప్పావు కప్పు
పుల్లటి మజ్జిగ - 1 కప్పు
వంట సోడా - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - ఇడ్లీ ప్లేట్లకు రాయడానికి
తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ లో అటుకులను వేసుకుని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి ఇడ్లీకి మంచి ఆకృతిని, మెత్తదనాన్ని ఇస్తుంది.
-ఒక పెద్ద గిన్నెలో రెండు కప్పుల బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) తీసుకోండి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్న అటుకుల పొడిని వేసి కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక కప్పు పుల్లటి మజ్జిగను వేసి బాగా కలపాలి. మజ్జిగ వేయడం వల్ల ఇడ్లీకి మంచి రుచి వస్తుంది. మిశ్రమం గట్టిగా ఉంటే తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఇడ్లీ పిండిలా జారుగా కలుపుకోవాలి.
-అందులో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా వేసి కలపాలి. ఒకవేళ మజ్జిగ పుల్లగా లేకపోతే కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు. ఈ మిశ్రమంపై మూత పెట్టి కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. దీనివల్ల రవ్వ నీటిని పీల్చుకుని మెత్తబడుతుంది.
-10 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి చెక్ చేసుకోండి. పిండి గట్టిపడితే మరికొన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండి మాదిరిగా వచ్చేలా సరిచేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి, గుంతల్లో పిండిని నింపాలి.
-ఇడ్లీ కుక్కర్ లేదా పాత్రలో నీళ్లు పోసి వేడి అయ్యాక ఈ ఇడ్లీ స్టాండ్ ను అందులో ఉంచాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 12 నుండి 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి.
-అంతే ఎంతో రుచికరమైన, దూదిలాంటి మెత్తటి మజ్జిగ ఇడ్లీ రెడీ. దీనిని వేడివేడిగా పల్లి చట్నీ, అల్లం చట్నీ లేదా కారప్పొడితో సర్వ్ చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications