Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా?
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
సాయంత్రం వేళ ఆఫీసు నుంచి రాగానే లేదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడి వేడి ఛాయ్ తాగుతూ కరకరలాడే స్నాక్స్ తింటే ఆ మజాయే వేరు. అలాంటి సమయంలో అందరికీ ముందుగా గుర్తొచ్చే సాంప్రదాయకమైన, అత్యంత రుచికరమైన స్నాక్ మురుకులు. పెద్ద మురుకులు చేయడం కంటే, పిల్లలు సైతం ఎంతో ఆకర్షితమై ఇష్టంగా తినేలా చిన్న చిన్నగా ఉండే చిట్టి చిట్టి మురుకులను ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు.

చిట్టి మురుకులు తయారీకి కావాల్సిన పదార్థాలు
-అటుకులు
-శెనగపప్పు
-కారం
-కలోంజి సీడ్స్
-జీలకర్ర
-నువ్వులు
-బియ్యం పిండి
-ఉప్పు
-నూనె
-నెయ్యి
-గోరువెచ్చని నీళ్లు
చిట్టి మురుకులు తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద ప్లేట్ లో జల్లెడ పెట్టి అందులో 2 కప్పుల బియ్యం పిండి(250 గ్రాములు)వేసి జల్లించుకోవాలి. జల్లించుకున్న పిండిని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో 1 కప్పు గట్టి అటుకులు(75) గ్రాములు, అరకప్పు పుట్నాల పప్పు(తినే శెనగపప్పు 55గ్రాములు) వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన ఉంచుకున్న బియ్యం పిండిలోకి జల్లించుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ కలోంజి సీడ్స్, 1 టీస్పూన్ కారం, 1 టీస్పూన్ ఉప్పు వేసి వీటన్నింటిని పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. కావాలనుకుంటే ఇందులో జీలకర్రకు బదులుగా వాము కూడా వేసుకోవచ్చు.
-పిండిలో అన్నీ బాగా కలుపుకున్న తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి పిండికి బాగా పట్టేలా చేతులతో కలుపుకోవాలి. తర్వాత పిండిలో కొంచెం కొంచెంగా వేడి నీళ్లను దాదాపు 2 కప్పులను పోసుకుంటూ గరిటతో మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. కలిపాక దీనిమీద మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
-పది నిమిషాల తర్వాత మూత తీసి పిండిచి చేతులతో మరోసారి బాగా కలుపుకోవాలి. పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మురుకుల పిండి రెడీ.
-ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని అందులో సరిపడా పిండిని పెట్టుకొని నూనె రాసిన ప్లేట్ లో చిన్న చిన్నగా మురుకులను వత్తుకోండి. ఎక్కువ చుట్లు అక్కర్లేదు. 2 చుట్లు వేస్తే సరిపోతుంది.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసి అందులో వత్తుకున్న మురుకులు వేసి పైన వచ్చే నురగలు తగ్గి మంచి రంగు వచ్చేవరకు మురుకులను వేయించుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇలాగే చేసుకోండి.
-అంతే క్రిస్పీ మురుకులు రెడీ. వీటిని గాలిచొరబడని డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications