Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఉప్మా రవ్వతో ఇలా కూడా చేయొచ్చా? ఈ స్వీట్ రెసిపీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
భారతీయ సాంప్రదాయక వంటకాలలో స్వీట్లకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పండుగ ఏదైనా, శుభకార్యం ఏదైనా మన భోజనం చివరిలో స్వీట్ లేకపోతే అది అసంపూర్ణంగా అనిపిస్తుంది. మనందరికీ అత్యంత ఇష్టమైన స్వీట్లలో గులాబ్ జామున్ ముందు వరుసలో ఉంటుంది.
అయితే గులాబ్ జామున్ కన్నా ఇంకా ఈజీగా,సూపర్ టేస్టీగా అది కూడా ఉప్మా రవ్వతో టేప్టీ స్వీట్ బ్రెడ్ జామున్ తయారుచేసుకోవచ్చని మీకు తెలుసా? మన ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలైన బ్రెడ్, ఉప్మా రవ్వ(సూజీ)తో ఎంతో రుచికరమైన స్వీట్ తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఇది చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో తయారయ్యే వంటకం. ఉప్మా రవ్వతో ఈ టేస్టీ స్వీట్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-బ్రెడ్ ముక్కలు
-చిక్కని పాలు
-చక్కెర
-ఉప్మా రవ్వ
-బెల్లం
-యాలకల పొడి
-నెయ్యి
తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో 1 కప్పు చిక్కని పాలు, అర కప్పు నీళ్లు పోసి ఇందులో 4 స్పూన్ల చక్కెర వేసి మరిగించాలి.
-కొద్దిసేపు మరిగిన తర్వాత అందులో 1 కప్పు ఉప్మా రవ్వ(సుజీ రవ్వ)వేసి ముద్దగా వచ్చే వరకు కలుపుకోవాలి.
-ముద్దగా వచ్చాక అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆపేయాలి.
-ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టి అందులో 1 కప్పు బెల్లం, 1 కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు కరిగించాక అందులో కొద్దిగా యాలకల పొడి కూడా వేసి కలిపి చిక్కబడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆపేయాలి. పాకం రానక్కర్లేదు..చేతికి అంటుకుంటే చాలు.
-తర్వాత బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని, వాటి చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ అంచుల (Edges)ను కత్తిరించాలి. కేవలం మధ్యలో ఉన్న తెల్లటి భాగాన్ని మాత్రమే తీసుకోవాలి.
-ఇప్పుడు ఆ బ్రెడ్ ని నీటిలో ముంచి మెత్తగా అయిన తర్వాత దాని మధ్యలో కొద్దిగా ఉప్మారవ్వ మిశ్రమాన్ని పెట్టి మడతబెట్టి మొత్తం బ్రెడ్ తో కవర్ అయ్యేట్లు చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి లేదా ఆయిల్ వేసి మిశ్రమం ఉంచిన బ్రెడ్ ముక్కలను అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి.
-తర్వాత వీటిని రెడీ చేసుకున్న పాకంలో వేసి 1 నిమిషం ఉంచాలి. అంతే బ్రెడ్ స్వీట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications