Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మిగిలిపోయిన అన్నంతో ఇన్‌స్టంట్ వడలు.. ఒక్కసారి రుచి చూస్తే జీవితంలో మరిచిపోరు! ఎలా చేసుకోవాలంటే?
సాధారణంగా ప్రతిరోజూ ఎంతోకొంత అన్నం మిగిలిపోతుంటుంది. ఆ అన్నం చల్లారడంతో దానిని తినేందుకు ఇష్టపడరు. అది కుళ్లిపోయాక పారేస్తుంటాం. అయితే ఇలా మిగిలిపోయిన అన్నంతో ఎంతో రుచికరమైన, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వడలు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా రెడీ చేసుకోవచ్చు. ఇవి రుచికరంగా ఉండడంతో పాటు, వీటిని చేసుకోవడం కూడా చాలా సులభం. అయితే ఈ వడలు ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మిగిలిపోయిన అన్నంతో వడలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు
- రెండు కప్పుల అన్నం
- రెండు టేబుల్ స్పూన్ల పెరుగు
- రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి
- రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ
- సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ
- ఒక టీ స్పూన్ జీలకర్ర
- సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి
- అర టీ స్పూన్ మిరియాల పొడి
- ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము
- సన్నగా తరిగిన కాస్త కొత్తిమీర, కరివేపాకు
- రుచికి తగినంత ఉప్పు
- డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె

వడలు తయారు చేసుకునే విధానం
ముందుగా మిగిలిపోయిన అన్నాన్ని తీసుకోవాలి. ఆ అన్నంతో పాటు పెరుగును కూడా కలుపుకొని మిక్సీలో వేసుకోవాలి. అందులో ఎలాంటి నీరు కలపకుండా పెరుగు, అన్నాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తరువాత అన్నం, పెరుగు పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులోనే బియ్యం పిండి, ఉప్మా రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, అల్లం తురుము, మిరియాల పొడి, జీలకర్ర వేసుకొని మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి.
అలా కలుపుకున్న పిండిని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పదిహేను నిమిషాలు పూర్తయిన తరువాత వడలు చేసేందుకు చేతులపై నూనె పోసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి తీసుకొని గుండ్రంగా ఒత్తి మధ్యలో రంధ్రం చేసి, వడ మాదిరిగా చేసుకోవాలి. కావాలంటే వడ చేసే కవర్‌కు నూనె రాసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా ఆ పిండి అన్నిటితో వడలు ఒకేసారి చేసుకోవచ్చు. లేదా ఒక్కొక్కటిగా కూడా చేసుకోవచ్చు.
ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసుకొని డీప్ ఫ్రై చేసేందుకు వీలుగా వేడి చేసుకోవాలి. నూనె మరీ వేడిగా కాకుండా మీడియం వేడిగా ఉన్నప్పుడే అందులో వడలు వేసుకొని మీడియం మంటపైనే వడలను ఫ్రై చేసుకోవాలి. వడలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లో తీసుకుంటే సరిపోతుంది. కరకరలాడే ఎంతో రుచికరమైన మిగిలిపోయిన అన్నంతో వడ సిద్ధమైపోయినట్లే. దీనిని అల్లం చట్నీ, పల్లి చట్నీతో కలిపి తినొచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications