మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు..

Posted By:

మినపప్పు లేకుండానే అప్పటికప్పుడు టేస్టీ వడలు తయారుచేసుకోవచ్చని మీకు తెలుసా? అది కూడా మిగిలిపోయిన అన్నంతో చేయవచ్చుని తెలుసా? సాధారణంగా మన ఇళ్లల్లో రాత్రి వండిన అన్నం మిగిలిపోతే ఉదయాన్నే దాన్ని పులిహోరగానో లేదా ఎగ్ రైస్ గానో చేసుకుంటాం. మరికొందరు అయితే దోశలు కూడా మిగిలిపోయిన అన్నంతో చేసుకుంటారు.

అయితే క్రిస్పీ, టేస్టీ వడలు కూడా మిగిలిపోయిన అన్నంతో చేసుకోవచ్చు. జస్ట్ 15 నిమిషాల్లోనే చేసుకోవడం దీని స్పెషాలిటీ. తింటుంటే ఎన్నైనా అలా పోతూ ఉంటాయి..అంత రుచిగా ఉంటాయి. మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ, టేస్టీ వడలు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Instant vada without urad dal how to make leftover rice vada in just 15 minutes recipe in telugu

కావాల్సిన పదార్థాలు

-కరివేపాకు
-కొత్తిమీర
-అల్లం
-పచ్చిమిర్చి
-జీలకర్ర
-పెరుగు
-వండిన అన్నం
-ఉల్లిపాయ
-బొంబాయి రవ్వ
-బియ్యం పిండి
-ఆయిల్
-ఉప్పు

కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్

తయారీ విధానం

-ముందుగా మిక్సీ జార్ లో 2 కప్పుల వండిన అన్నం వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి నీళ్లు పోయకుండానే ఫైన్ గా గ్రైండ్ చేసుకోండి.

-గ్రైండ్ చేసుకున్న అన్నం,పెరుగు మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే అర టీస్పూన్ జీలకర్ర ,సన్నగా తరిగిన పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ(సూజీ), 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి సన్న ముక్కలు , 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు వేసి మొత్తం బాగా కలిసేలా ముద్దలా కలుపుకోవాలి. తర్వాత దీనిపై మూతపెట్టి 15 నిమిషాలు అలా వదిలేస్తే మంచిగా నానుతుంది. ఇందులో రవ్వ వేశాం కాబట్టి అది నానితే వడలు బాగా ఆకృతిలో, టేస్టీగా వస్తాయి.

-15 నిమిషాల తర్వాత చేతిని నీటిలో ముంచుకుంటూ రెడీ అయిన మిశ్రమంలో నుంచి కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకొని వడల్లా వత్తుకోండి. లేదా కవర్ లేదా బటర్ పేపర్ మీద లైట్ గా నీటిని అప్లై చేసి వడల్లా ఒత్తుకోవచ్చు.

-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి తగినంత నూనె వేసి వేడయ్యాక అందులో ఒత్తుకున్న వడలను వేసి మంచి కలర్ వచ్చేదాకా వేయించాక వీటిని ఓ టిష్యూ పేపర్ లోకి తీసుకోండి. దీంతో అందులో ఉన్న అదనపు నూనె పోతుంది.

-అంతే క్రిస్పీ వడలు రెడీ. వీటిని మీకు నచ్చిన చట్నీతో ఆస్వాదించవచ్చు.

[ of 5 - Users]
Story first published: Monday, October 19, 2026, 10:18 [IST]
Desktop Bottom Promotion