Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఆదివాసీ స్పెషల్ ఇప్ప పువ్వు లడ్డు..ఒక్కటి తింటే చాలు 100 రకాల లాభాలు!
భారతదేశం సంప్రదాయ ఆహారపు అలవాట్లకు, ఔషధ గుణాలు కలిగిన వంటకాలకు పెట్టింది పేరు. అందులోనూ మన అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, ఆదివాసీలు ప్రకృతి ప్రసాదించిన వనరులతో తయారుచేసే ఆహార పదార్థాలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రధాని మోదీ ఇప్ప పువ్వు లడ్డు రుచిని, దాని వెనుక ఉన్న పోషక విలువలను ప్రశంసించడంతో ఈ లడ్డు పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.
ఇది పూర్తిగా సహజసిద్ధమైన పదార్థాలతో తయారవుతుంది కాబట్టి పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ ఇది మంచిది. రక్తహీనతతో బాధపడే మహిళలకు, పిల్లల ఎదుగుదలకు, వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల నొప్పుల నివారణకు,ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించుకోవడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ లడ్డు ఉపయోగపడుతుంది. ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ ఇప్ప పువ్వు లడ్డు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-పల్లీలు
-ఇప్పపువ్వు
-నువ్వులు
-బెల్లం
-జీడిపప్పు
-కిస్మిస్
-నెయ్యి
-యాలకలు
తయారీ విధానం
-స్టవ్ మీద అడుగు మందంగా ఉండే పాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలు(వేరుశెనగపప్పు)వేసి తక్కవ మంట మీద 90 శాతం వరకు వేగాక అందులో 1కప్పు నువ్వులు కూడా వేసి తక్కువ మంట మీద కమ్మని వాసన వచ్చేవరకు వేయించి ఈ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో 1 స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక అందులో 1 కప్పు ఇప్ప పువ్వు(ఎండబెట్టినది)వేసి కిస్మిస్ ని వేయించినట్లుగా వేయించుకోవాలి. మాడితే చేదు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి తక్కువ మంట మీద మాడకుండా 5 నిమిషాలు వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత అదే పాన్ లో అర స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక అందులో గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసి ఇవి సగం వరకు వేగాక అందులో గుప్పెడు కిస్మిస్ కూడా వేసి వేగాక ఈ రెండింటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో పూర్తిగా చల్లారిన నువ్వులు,పల్లీల మిశ్రమం వేసి ఇందులోనే 3 యాలకలు కూడా వేసి మరీ మెత్తని పొడిలా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు వేయించిన ఇప్ప పువ్వు మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ముప్పావు కప్పు లేదా మీ తీపికి తగినట్లుగా బెల్లం వేసి,పావు కప్పు నీళ్లు కూడా పోసి తక్కువ మంట మీద కలుపుతూ కరిగించాలి. పూర్తిగా కరిగి నురగలు వస్తూ ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆపేయండి.
-ఇప్పుడు బెల్లం పాకంలో ముందుగా గ్రైండ్ చేసిన పొడులన్నీ వేసుకోండి. వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసి బాగా కలిపి లడ్డుల్లా ఉండలు చుట్టుకోండి. అంతే ఆదివాసీ ఇప్ప పువ్వు లడ్డు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications