Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి!
మన దేశంలో టీ లేదా ఛాయ్ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అదొక మధురానుభూతి. ముఖ్యంగా భాగ్యనగరం హైదరాబాద్ అనగానే బిర్యానీ తర్వాత అందరికీ ఠక్కున గుర్తొచ్చేది ఇరానీ ఛాయ్.
పాతబస్తీలోని కేఫ్ లలో గుమగుమలాడే ఇరానీ ఛాయ్ రుచి జీవితంలో ఒక్కసారైనా ఆస్వాదించాల్సిందే. చిక్కటి పాలు, అద్భుతమైన క్రీమీ ఆకృతి, టీ ఆకుల సహజమైన వగరుకు తోడుగా సరిపడా తీపి... ఇవన్నీ కలిస్తేనే అసలైన ఇరానీ టీ.

అసలు ఈ ఇరానీ ఛాయ్ ఎక్కడి నుంచి వచ్చింది?
శతాబ్దాల క్రితం వ్యాపారం నిమిత్తం ఇరాన్ దేశం నుంచి భారతదేశానికి వలస
వచ్చిన పార్శీలు, ఇరానియన్ల ద్వారా ఈ ఛాయ్ మన దేశంలోకి
అడుగుపెట్టింది. ఈ టీ తయారీలో అసలైన రహస్యం సహనం. దీనిని సాధారణ టీ
లాగా నీళ్లు, పాలు, టీపొడి అన్నీ ఒకేసారి వేసి మరిగించరు. ఇదొక
కళ.
ముందుగా టీ డికాక్షన్ ను విడిగా తయారు చేస్తారు. ఆ తర్వాత పాలను సన్నని మంటపై ఎక్కువసేపు మరగబెట్టి చిక్కగా చేస్తారు. కప్పులో వడ్డించేటప్పుడు ముందుగా డికాక్షన్, ఆ తర్వాత పాలు పోస్తారు. ఈ విభిన్నమైన తయారీ విధానమే ఇరానీ టీకి అంతటి కీర్తిని తెచ్చిపెట్టింది. హైదరాబాద్ కేఫ్ లలో దొరికే ఇరానీ ఛాయ్ ని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
ఫుల్ క్రీమ్ పాలు - 2 కప్పులు
నీళ్లు - ఒకటిన్నర కప్పులు
నాణ్యమైన టీ పొడి - 2 టేబుల్ స్పూన్లు
చక్కెర - 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు
యాలకులు - 2 లేదా 3
కండెన్స్డ్ మిల్క్ (మిల్క్ మేడ్) - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయండి. నీళ్లు మరుగుతున్నప్పుడు టీపొడి, కొద్దిగా దంచిన యాలకులు వేసి బాగా కలపండి. మంటను పూర్తిగా తగ్గించి సుమారు 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. నీరు ముదురు రంగులోకి మారి టీపొడి సారం అంతా నీటిలోకి దిగాక, స్టవ్ ఆపేసి ఆ డికాక్షన్‌ను వడకట్టి పక్కన పెట్టుకోండి.
-మందపాటి అడుగు ఉన్న మరొక గిన్నెలో ఫుల్ క్రీమ్ పాలను పోసి సన్నని మంట మీద 8 నుంచి 10 నిమిషాల పాటు బాగా మరిగించండి. పాలు అడుగంటకుండా గరిటెతో నిదానంగా కలుపుతూ ఉండాలి. పాలు కొద్దిగా చిక్కబడ్డాక అందులో చక్కెర, కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలపండి.
-ఇప్పుడు ఒక కప్పును తీసుకోండి. అందులో పావు వంతు వరకు సిద్ధం చేసుకున్న డికాక్షన్ పోయండి. ఆ తర్వాత పైనుంచి వేడివేడి చిక్కటి పాలను పోయండి. అంతే... రెండు పొరలుగా కలిసిపోయే ఇరానీ ఛాయ్ రెడీ.
-ఈ కమ్మటి వేడి వేడి ఇరానీ టీని ఉస్మానియా బిస్కెట్లతో కానీ, బన్ మస్కా (వెన్న రాసిన బన్)తో కానీ ఆస్వాదిస్తే ఆ మజాయే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications