మహిళలకు అమృతంతో సమానం.. ఎముకల పటిష్టతకు, రక్తహీనతను తరిమికొట్టే హెల్తీ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో అలసట, నీరసం అనేది సర్వసాధారణం అయిపోయాయి. ముఖ్యంగా మహిళలకు, ఎదుగుతున్న పిల్లలకు తక్షణ శక్తి, సరైన పోషణ చాలా అవసరం. ఎలాంటి కృత్రిమ చక్కెరలు లేకుండా, కేవలం సహజ సిద్ధమైన పదార్థాలతో అమితమైన శక్తినిచ్చే ఒక అద్భుతమైన రెసిపీ గురించి మీకు తెలుసా? అదే ఐరన్ రిచ్ ఎనర్జీ లడ్డూ.

ఇది అణువణువునా పోషకాలతో నిండిన ఒక పవర్‌ హౌస్ లాంటిది. రోజుకో లడ్డూ తింటే చాలు, మీ శరీరానికి కావాల్సిన ఎనర్జీ దొరుకుతుంది. మరి ఈ సూపర్ హెల్తీ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Iron Rich Energy Laddus Recipe in Telugu No Sugar Super Healthy

ఐరన్ రిచ్ ఎనర్జీ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు

పొట్టు మినపప్పు- అర కప్పు
నల్ల నువ్వులు - అర కప్పు
గుమ్మడి గింజలు- పావు కప్పు
అవిసె గింజలు- పావు కప్పు
పుట్నాల పప్పు (వేపిన శనగపప్పు) - అర కప్పు
యాలకులు - 2
గింజ తీసేసిన ఖర్జూరాలు - 10
స్వచ్ఛమైన నెయ్యి - 1 లేదా 2 టేబుల్ స్పూన్లు

ఐరన్ రిచ్ ఎనర్జీ లడ్డు తయారీ విధానం

-స్టవ్ వెలిగించి మందంగా ఉన్న ఒక పాన్ పెట్టుకోండి. అందులో పొట్టు మినపప్పు, నల్ల నువ్వులు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, పుట్నాల పప్పు,రెండు యాలకులు వేసి దోరగా వేయించుకోవాలి. మంటను సిమ్‌ లో ఉంచి, కమ్మటి వాసన వచ్చే వరకు వేయిస్తే లడ్డూ రుచి అద్భుతంగా ఉంటుంది.

-వేయించుకున్న దినుసులను ఒక ప్లేట్‌ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత వీటిని మిక్సీ జార్‌ లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

-ఇప్పుడు 10 ఖర్జూరాలను తీసుకుని, మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌ లా చేసుకోవాలి.

-ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గింజల పొడిలో, ఈ ఖర్జూరం పేస్ట్‌ ను వేసి చేతితో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలోనే కరిగించిన 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి.

-ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ గుండ్రని లడ్డూల్లా చుట్టుకోవాలి.

అంతే పోషకభరితమైన ఐరన్ రిచ్ లడ్డూలు రెడీ.

ఆరోగ్య ప్రయోజనాలు

ఐరన్ పుష్కలం
ఇందులో వాడిన నల్ల నువ్వులు, మినపప్పు రక్తహీనతను దరిచేరనివ్వవు. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో ఇవి గ్రేట్‌ గా పనిచేస్తాయి.

ప్రోటీన్,హెల్తీ ఫ్యాట్స్
గింజల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, పప్పులలోని ప్రోటీన్ మిమ్మల్ని రోజంతా యాక్టివ్‌ గా ఉంచుతాయి. ఇది కడుపు నిండిన భావననిచ్చి అనవసరపు జంక్ ఫుడ్ తినకుండా అడ్డుకుంటుంది.

కాల్షియం ఖజానా
నల్ల నువ్వులలో కాల్షియం అపారంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో ఎముకల పటిష్టతకు ఇది ఎంతగానో సహాయపడుతుంది.

పిల్లల ఎదుగుదలకు
పెరుగుతున్న పిల్లలకు కావాల్సిన సమగ్ర పోషణ ఈ లడ్డూ ఇస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి వారిని దృఢంగా ఉంచుతుంది.

చక్కెరకు చెక్
ఇందులో రిఫైండ్ షుగర్ అస్సలు వాడలేదు. ఖర్జూరంలోని సహజమైన తీపి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

[ of 5 - Users]
q
Desktop Bottom Promotion