Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
జిలేబీ రెసిపీ: ఇంట్లో స్వయంగా.. సులభంగా జిలేబి ఎలా తయారుచేయాలి
జిలేబి ప్రసిద్ధి చెందిన ఉత్తర భారతీయ తీపి వంటకం. ఇది దేశ వ్యాప్తంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. జిలేబిని పండుగలు మరియు శుభకార్యాల్లో తయారుచేస్తారు. జిలేబి చక్కర పాకంలో ముంచి తయారుచేసే కరకరలాడే తీపి వంటకం.
జిలేబి పిండిని 6 నుంచి 8 గంటల పాటు పులియ బెడతారు. అందువల్ల జిలేబి కొంచెం పులుపు రుచిని కలిగి ఉంటుంది. అయితే ఇప్పుడు త్వరగా రెడీ అయ్యే విధంగా జిలేబి రెసిపీ తయారీని చెప్పుతున్నాం.
ఇంటిలో తయారుచేసుకునే జిలేబి రుచి బయట కొనుకోలు చేసిన జిలేబి రుచినే కలిగి ఉంటుంది. ఇక్కడ మేము జిలేబి రుచి పులుపు కోసం ఎటువంటి పదార్ధాన్ని కలపటం లేదు. అయితే జిలేబి కొంచెం పుల్లగా ఉండాలని అనుకుంటే పిండికి కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపండి.
జిలేబి సాధారణ మరియు త్వరగా తయారయ్యే రెసిపీ. జిలేబి తయారీలో పిండిని సరైన పాళ్లల్లో కలపాలి. జిలేబి త్వరగా ఎలా తయారుచేయాలో ఈ వీడియోలో చూడండి. అలాగే స్టెప్ బై స్టెప్ ప్రక్రియను ఫోటోలలో చూడండి.
జిలేబి వీడియో రెసిపీ
Recipe By: మీనా భండారీ
Recipe Type: స్వీట్
Serves: 10-12 ముక్కలు
-
మైదా - 1 కప్పు
శనగ పిండి - 1 టేబుల్ స్పూన్
తాజా పెరుగు - 1 కప్పు
చక్కెర - 1 కప్పు
నీరు - 4 కప్పులు
కుంకుమ పువ్వు - 4-5 రేకలు
ఫ్రూట్ సాల్ట్ - చిటికెడు
కుంకుమ పువ్వు రంగు - చిటికెడు
నెయ్యి - 1 కప్పు
-
1. బౌల్ లోకి మైదా పిండి తీసుకోవాలి.
2. దానికి శనగపిండి మరియు తాజా పెరుగు కలపాలి.
3. ఉండలు లేకుండా మందపాటి పేస్ట్ గా కలపాలి.
4. కలిపిన పిండిని 10 నిమిషాల పాటు కదపకుండా ఆలా ఉంచాలి.
5. ఈ లోపు పొయ్యి మీద పాన్ పెట్టి పంచదార వేయాలి.
6. పంచదారలో నీరు పోయాలి.
7. పంచదార కరిగే వరకు 3 నుంచి 5 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి.
8. కుంకుమ పువ్వు మరియు ఫుడ్ కలర్ కలపాలి.
9. తక్కువ మంట మీద బాగా కలపాలి.
10. పిండిలో చిటికెడు ఫ్రూట్ సాల్ట్ కలపాలి.
11.ప్లాస్టిక్ స్క్వీజ్ బాటిల్ తీసుకోండి. మూత తెరిచి పై భాగంలో ఒక గరాటు ఉంచండి.
12. బాటిల్ లోకి పిండిని గరాటు ద్వారా వేసి బాటిల్ కి నాజిల్ ఉన్న మూతను పెట్టాలి.
13. పొయ్యి మీద పాన్ పెట్టి నెయ్యి పోసి కరిగించి రెండు నిముషాలు వేడి చేయాలి.
14. నెయ్యి వేడెక్కాక పిండి వేసుకున్న బాటిల్ తీసుకొని బాటిల్ ని నొక్కుతూ జిలేబి ఆకారం వచ్చేలా వేయాలి.
15. జిలేబి రౌండ్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా జాగ్రత్తగా వేయాలి.
16. రెండు వైపుల గోల్డ్ కలర్ వచ్చేవరకు జాగ్రత్తగా వేగించాలి.
17. బాగా వేగిన జిలేబిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
18. ఆ జిలేబి మీద పంచదార పాకాన్ని పోసి 30 సెకన్ల పాటు అలానే ఉంచాలి.
19. వేడి వేడి జిలేబీలకు సర్వ్ చేయండి.
- 1. పెరుగు పుల్లగా లేకుండా తాజాగా ఉండాలి.
- 2. జిలేబి పుల్లగా కావాలని అనుకుంటే పిండిని 6 నుంచి 7 గంటలు పులియబెట్టాలి.
- 3. పుల్లని జిలేబి త్వరగా కావాలంటే జిలేబి పిండిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి.
- 4. మైదా పరిమాణం పంచదార పరిమాణం రెండు సమానంగా ఉండాలి.
- 5. జిలేబిలు వేగించినప్పుడు ఉబ్బాలంటే ఫ్రూట్ సాల్ట్ ఉపయోగించాలి.
- సర్వింగ్ సైజ్ - 1 ముక్క
- కేలరీలు - 310 కేలరీలు
- కొవ్వు - 10 గగ్రాములు
- ప్రోటీన్ - 2 గ్రాములు
- కార్బోహైడ్రేట్లు - 54 గ్రాములు
- షుగర్ - 20 గ్రాములు
స్టెప్ బై స్టెప్
1. బౌల్ లోకి మైదా పిండి తీసుకోవాలి.
2. దానికి శనగపిండి మరియు తాజా పెరుగు కలపాలి.
3. ఉండలు లేకుండా మందపాటి పేస్ట్ గా కలపాలి.
4. కలిపిన పిండిని 10 నిమిషాల పాటు కదపకుండా ఆలా ఉంచాలి.
5. ఈ లోపు పొయ్యి మీద పాన్ పెట్టి పంచదార వేయాలి.
6. పంచదారలో నీరు పోయాలి.
7. పంచదార కరిగే వరకు 3 నుంచి 5 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి.
8. కుంకుమ పువ్వు మరియు ఫుడ్ కలర్ కలపాలి.
9. తక్కువ మంట మీద బాగా కలపాలి.
10. పిండిలో చిటికెడు ఫ్రూట్ సాల్ట్ కలపాలి.
11.ప్లాస్టిక్ స్క్వీజ్ బాటిల్ తీసుకోండి. మూత తెరిచి పై భాగంలో ఒక గరాటు ఉంచండి.
12. బాటిల్ లోకి పిండిని గరాటు ద్వారా వేసి బాటిల్ కి నాజిల్ ఉన్న మూతను పెట్టాలి.
13. పొయ్యి మీద పాన్ పెట్టి నెయ్యి పోసి కరిగించి రెండు నిముషాలు వేడి చేయాలి.
14. నెయ్యి వేడెక్కాక పిండి వేసుకున్న బాటిల్ తీసుకొని బాటిల్ ని నొక్కుతూ జిలేబి ఆకారం వచ్చేలా వేయాలి.
15. జిలేబి రౌండ్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా జాగ్రత్తగా వేయాలి.
16. రెండు వైపుల గోల్డ్ కలర్ వచ్చేవరకు జాగ్రత్తగా వేగించాలి.
17. బాగా వేగిన జిలేబిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
18. ఆ జిలేబి మీద పంచదార పాకాన్ని పోసి 30 సెకన్ల పాటు అలానే ఉంచాలి.
19. వేడి వేడి జిలేబీలకు సర్వ్ చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.

Click it and Unblock the Notifications