Latest Updates
-
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే!
జార్ఖండ్ స్పెషల్ జామకాయ చట్నీ..చలికాలంలో వేడి వేడి అన్నంలోకి కిర్రాక్
చలికాలం వచ్చిందంటే చాలు.. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, పక్కన ఏదైనా ఘాటైన పచ్చడి లేదా చట్నీ ఉంటే ఆ భోజనం రుచే వేరుగా ఉంటుంది. సాధారణంగా మనం కొత్తిమీర, పుదీనా, టమాటో లేదా మామిడికాయ పచ్చళ్లను తరచుగా తింటూ ఉంటాం. కానీ ఎప్పుడైనా జామకాయ చట్నీ గురించి విన్నారా? మనం పండుగా తినే జామకాయతో అద్భుతమైన చట్నీ చేసుకోవచ్చు.
ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఈ జామకాయ చట్నీ చాలా ఫేమస్. తీపి, పులుపు, కారం కలగలిపిన ఈ చట్నీ రుచి ఒక్కసారి చూశారంటే మీరు ఖచ్చితంగా మీ రెగ్యులర్ డైట్ లో దీనిని చేర్చుకుంటారు. చేయడం చాలా సులభం, రుచిలో అమోఘం. ఈ ప్రత్యేకమైన జార్ఖండ్ స్పెషల్ జామకాయ చట్నీని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
దోర జామకాయలు: 3
పచ్చిమిర్చి: 3-4
కొత్తిమీర: అర కప్పు
అల్లం: చిన్న ముక్క
నిమ్మరసం: 1 టీస్పూన్
ధనియాల పొడి: అర టీస్పూన్
జీలకర్ర పొడి: అర టీస్పూన్
నల్ల మిరియాల పొడి: అర టీస్పూన్
ఇంగువ: చిటికెడు
నల్ల ఉప్పు: అర టీస్పూన్
నీరు: అవసరమైనంత
జామకాయ చట్నీ తయారీ విధానం
-పచ్చి జామకాయలను నీటితో శుభ్రంగా కడిగి, తడి లేకుండా పొడి వస్త్రంతో తుడవండి.
-ఇప్పుడు జామకాయలను సగానికి కట్ చేయండి. చట్నీ మెత్తగా రావాలంటే, మధ్యలో ఉండే గట్టి విత్తనాలను తొలగించడం చాలా ముఖ్యం. విత్తనాలు తీసేసిన తర్వాత జామకాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి.
-కొత్తిమీర, పచ్చిమిరపకాయలను కూడా నీటిలో శుభ్రంగా కడగండి. అల్లం పై తొక్క తీసి చిన్న ముక్కగా ఉంచుకోండి.
-ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో తరిగిన జామకాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వేయండి. ఇందులోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చిటికెడు ఇంగువ, నల్ల ఉప్పు వేయండి. అవసరమైతే కొద్దిగా నీరు పోసి మెత్తగా పేస్ట్‌లా గ్రైండ్ చేయండి.
-గ్రైండ్ చేసిన చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి. దీనికి ఒక టీస్పూన్ నిమ్మరసం జత చేసి బాగా కలపండి. అంతే ఎంతో రుచికరమైన, ఘాటైన జార్ఖండ్ స్పెషల్ జామకాయ చట్నీ రెడీ. దీనిని వేడి అన్నం, రోటీ, చపాతీ లేదా పరాఠాలతో సర్వ్ చేస్తే ఇంట్లో అందరూ లొట్టలేసుకుంటూ తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications