Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
నోటికి రుచి, ఒంటికి బలం.. క్యారెట్, పాలకూరతో అద్దిరిపోయే జొన్న అప్పాలు!
పూర్వకాలంలో మన తాత ముత్తాతలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి ప్రధాన కారణం వారు తీసుకున్న ఆహారమే. అప్పట్లో చిరుధాన్యాలు (మిల్లెట్స్) వారి రోజువారీ ఆహారంలో అంతర్భాగంగా ఉండేవి. వాటిలో జొన్నలు చాలా ముఖ్యమైనవి. ఆధునిక కాలంలో జంక్ ఫుడ్ వల్ల వస్తున్న అనేక ఆరోగ్య సమస్యల దృష్ట్యా, ప్రజలు మళ్లీ మన పాత కాలపు చిరుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నారు.
జొన్నలతో రొట్టెలు, సంగటి మాత్రమే కాకుండా ఎన్నో రకాల స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. అటువంటి ఒక అద్భుతమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్ రెసిపీ జొన్న అప్పాలు. జొన్న అప్పాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనిని స్నాక్ లాగా తినవచ్చు లేదా బ్రేక్ పాస్ట్ గా అయినా తినవచ్చు. ఈ అప్పాలు తయారు చేయడానికి మన వంటగదిలో సులభంగా దొరికే పదార్థాలే సరిపోతాయి. జొన్న అప్పాలు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-అల్లం
-జీలకర్ర
-పచ్చిమిరపకాయ
-జొన్న పిండి
-పాలకూర
-ఉల్లిపాయ
-క్యారెట్
-కొత్తిమీర
-ఉప్పు
-తెల్ల నువ్వులు
-నూనె లేదా నెయ్యి
తయారీ విధానం
-మిక్సీ గిన్నెలో చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 1 కప్పు జొన్న పిండి, 1 కప్పు సన్నగా కట్ చేసిన పాలకూర, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, గ్రైండ్ చేసుకున్న పేస్ట్,రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తం కలిసేలా చేత్తో కలుపుకోండి.
-ఇప్పుడు అందులోనే కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని అంతా ముద్దలా కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా కులపుకుంటామో అలా గట్టిగా కలుపుకోవాలి. లూజ్ గా కలుపుకోవద్దు. పిండి గట్టిగా ఉంటేనే అప్పాలు బాగా వస్తాయి.
-తర్వాత కలిపిన పిండిలో నుంచి కొంచెం చేతుల్లోకి తీసుకొని ఉండలా చేసుకొని దానిని తడి గుడ్డ మీద పెట్టి ఒత్తుకోవాలి. గుండ్రంగా చిన్న అప్పాల్లా ఒత్తుకోండి.
-ఒత్తుకున్నాక దానీమీద తెల్ల నువ్వులు కొంచెం చల్లుకొని మళ్లీ ఒత్తుకోండి. మొత్తం పిండితో ఇలా అప్పాలను ఒత్తుకోండి.
-తర్వాత స్టవ్ మీద చపాతీ పెండెం పెట్టి వేడయ్యాక దీని మీద ఒక్కో అప్పాన్ని వేసి మీడియం మంట మీద రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. ఆయిల్ లేదా నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. అంతే వేడి వేడి జొన్న అప్పాలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications