Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
షుగర్ కంట్రోల్, బరువు తగ్గాలనుకునే వారికి అమృతం.. స్వర్గాన్ని తలపించే మెత్తని జొన్న రొట్టెలు చేసుకోండిలా..
జొన్న రొట్టె అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది రాయలసీమ, ఉత్తర కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలు. ఒకప్పుడు పల్లెటూళ్లకే పరిమితమైన జొన్న రొట్టె ఇప్పుడు పట్టణాల్లో కూడా ప్రధాన ఆహారంగా మారిపోయింది. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఆరోగ్య సమస్యల (షుగర్, ఒబెసిటీ) కారణంగా చాలా మంది బియ్యం, గోధుమలకు బదులుగా చిరుధాన్యాలను (మిల్లెట్స్) తమ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటున్నారు. అందులో జొన్నలు అత్యంత ప్రధానమైనవి.
అయితే జొన్న రొట్టెలు చేయడం చాలా కష్టం అని, అవి గట్టిగా వస్తాయని లేదా విరిగిపోతాయని చాలామంది భయపడుతుంటారు. కానీ అత్యంత మృదువైన, రుచికరమైన జొన్న రొట్టెలను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-జొన్న పిండి
-ఉప్పు
-నీళ్లు
తయారీ విధానం
-ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ జొన్న పిండి వేసి,ఇందులో కొన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన ఉంచుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 కప్పు నీళ్లు పోసి వేడి చేసుకున్నాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపాక ఇందులోనే కలిపి పెట్టుకున్న జొన్న పిండి వాటర్ ని పోసి బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు మంటను సిమ్ లో పెట్ట పాన్ లోనే 1కప్పు జొన్న పిండి వేసుకొని ఉండలు రాకుండా కలుపుకొని స్టవ్ ఆపేసి పాన్ మీద మూత పెట్టేయండి.
-2 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని బాగా కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి.
-కలుపుకున్న పిండిలో నుంచి కావాల్సినంత పిండిని చేతుల్లోకి తీసుకొని తీసుకొని బండ మీద లేదా ఫ్లోర్ మీద నీటుగా మసాజ్ చేసినట్లు చేసుకొని తర్వాత రౌండ్ బాల్ లా చేసుకొని దానిమీద పొడి పిండి చల్లుకోండి.
-ఇప్పుడు చేత్తో పిండిని కొంచెం ఒత్తుకొని తర్వాత చపాతీ కర్రతో దానిని ఒత్తుకొవాలి. కావాల్సినంత పల్చగా ఒత్తుకోండి.
-తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి అది వేడెక్కాక దానిమీద ఒత్తుకున్న జొన్న రొట్టె వేసి పై నుంచి నీళ్లను చిలకరించుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. మాడకుండా మడియం మంట మీద కాల్చుకోండి.
-అంతే మెత్తని జొన్న రొట్టె రెడీ. దీనిని నచ్చిన కూరతో తింటుంటే స్వర్గమే.
కొన్ని ప్రయోజనాలు
-బరువు తగ్గాలనుకునే వారికి జొన్న రొట్టె ఒక అద్భుతమైన వరం. ఇందులో డైటరీ ఫైబర్ (పీచు పదార్థం) చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఒక జొన్న రొట్టె తింటే కడుపు నిండిన భావన చాలా సేపటి వరకు ఉంటుంది. దీనివల్ల మాటిమాటికీ ఆకలి వేయదు, చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. ఫలితంగా బరువు సులభంగా నియంత్రణలో ఉంటుంది.
-జొన్నల గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) చాలా తక్కువ కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎటువంటి భయం లేకుండా జొన్న రొట్టెలు తినవచ్చు.
-మలబద్ధకం, అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు రోజూ జొన్న రొట్టెలు తినడం వల్ల పేగుల కదలికలు మెరుగుపడి మలవిసర్జన సాఫీగా జరుగుతుంది.
-జొన్న రొట్టెలు తినడం వల్ల బోలు ఎముకల వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి.
-జొన్న రొట్టెలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్పెంచుతాయి. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది, గుండెపోటు వంటి హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications