Latest Updates
-
మీ చిన్నారి చేతిలో దెబ్బలు తింటున్నారా? అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
ధనిష్ఠ నక్షత్రంలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి నేడు అదృష్టం, ధనలాభం ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి అద్భుతమైన ధనయోగం..! - బుధవారం, 01 జూలై 2026 -
యూట్యూబ్ వీడియో చూసి గర్భిణీ ప్రసవం, ఆపై మృతి.. సొంత చికిత్సలతో ఎంత ప్రమాదమో తెలుసా.! -
ఒంటరిగా ఉండటం ఆరోగ్యకరమేనా.. ఇవే కారణాలు అయితే నిర్లక్ష్యం వద్దు.! -
ఇంట్లో శాంతి, ఐక్యత పెరగాలంటే పూర్వీకులు పాటించిన ఆచారాలు -
నెయ్యి ఘుమఘుమలతో స్పెషల్ రొయ్యల వేపుడు.. గుండె ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్.! -
కొత్తగా పెళ్లయిందా.. ఆ ఐదేళ్లు తప్పనిసరిగా కలిసే జీవించాలి.. లేదంటే.! -
కస్టమర్లకు అలర్ట్.. జులైలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు. వివరాలివే.! -
పిల్లలకి ఖచ్చితంగా పెట్టాల్సిన ఫూల్ మఖానాతో హెల్తీ దోశ.. లంచ్ బాక్స్‌లోకి ఇష్టంగా లాగించేస్తారు.!
మన పూర్వీకులు తిన్న బ్రేక్ ఫాస్ట్ ఇదే..కొండలను ఢీకొట్టే శక్తి, ఇలా చేసుకోండి
నేటి ఆధునిక జీవనశైలిలో, బిజీ షెడ్యూల్స్ కారణంగా మనం తరచుగా తీసుకునే ఆహారంపై సరైన శ్రద్ధ పెట్టలేకపోతున్నాము. దీని ఫలితంగా డయాబెటిస్, బీపీ, ఊబకాయం వంటి అనేక జీవనశైలి వ్యాధులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మన పూర్వీకులు తిన్న తృణధాన్యాలు (మిల్లెట్స్) వైపు మళ్లీ ప్రపంచం దృష్టి సారిస్తోంది. వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందినది, ఆరోగ్యకరమైనది జొన్నలు.

మన తాత ముత్తాతలకు కొండంత బలాన్నిచ్చిన చిరుధాన్యం జొన్నలతో చేసే వంటకాల్లో ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా తీసుకునే జొన్న ఉప్మా ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా, మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తుంది. జొన్నలను మెత్తగా ఉడికించి, అందులో రంగురంగుల కూరగాయల ముక్కలు, పంటికి తగిలే కరకరలాడే పల్లీలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కమ్మని తాలింపుతో చేసే ఈ జొన్నల ఉప్మా రుచి చూశారంటే.. ఇక జీవితంలో సాధారణ ఉప్మా వంక కన్నెత్తి కూడా చూడరు.
జొన్నల ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు
-తెల్ల జొన్నలు
-నూనె
-తాలింపు గింజలు
-ఉల్లిపాయ
-కరివేపాకు
-పల్లీలు
-పచ్చిమిర్చి
-నిమ్మకాయ
-కొత్తిమీర
-ఉప్పు
-పసుపు
-క్యారెట్
-బీన్స్

జొన్నల ఉప్మా తయారీ విధానం
-ముందుగా 1 కప్పు జొన్నలను ఒక బౌల్ లో తీసుకొని నీరు పోసి 8 గంటలు నానబెట్టుకోవాలి లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి.
-రాత్రంతా జొన్నలు నానిన తర్వాత తర్వాత జొన్నలను 2-3 సార్లు శుభ్రంగా కడగాలి.
-స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కడిగిన జొనంనలను వేసి కొంచెం ఎక్కువగా నీరు పోసుకొని కుక్కర్ మూతపెట్టి 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
-కుక్కర్ లో ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి, ఉడికిన జొన్నలను చిల్లుల గిన్నెలో పోసుకుని నీటిని పూర్తిగా వంపేయాలి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 2 టీస్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో 1 టీస్పూన్ పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని వేయించాలి. తర్వాత ఇందులోనే 2 పచ్చిమిర్చి , 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 చిన్న ఉల్లిపాయ, 1 క్యారెట్ , 2 బీన్స్ ముక్కలుగా తరిగి వేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీలోని మిశ్రమంలో కొంచెం ఉప్పు, పావు టీస్పూన్ పసుపు వేసుకుని కూరగాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలి.
-కూరగాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులో ఉడికించిన జొన్నలను, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
-చివరగా అందులో కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి.
-స్టవ్ ఆపేసి జొన్నల ఉప్మాలో అర చెక్క నిమ్మరసం పిండుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి.
-అంతే హెల్తీ, టేస్టీ జొన్నల ఉప్మా రెడీ.
జొన్నల ఉప్మా ఆరోగ్య ప్రయోజనాలు
కేవలం రుచి కోసమే కాకుండా, మన శరీరాన్ని ఉక్కులా మార్చే ఎన్నో ఔషధ గుణాలు ఈ జొన్నల ఉప్మా సొంతం.
మధుమేహులకు అమృతం
బియ్యం లేదా గోధుమ రవ్వతో పోలిస్తే జొన్నలకు గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా
తక్కువ. అంటే ఇవి తిన్న వెంటనే రక్తంలోకి చక్కెరను ఒక్కసారిగా విడుదల
చేయవు. ఇందులో ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు నిదానంగా జీర్ణమై,
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. కాబట్టి షుగర్
వ్యాధిగ్రస్తులకు ఇది ఒక బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.
బరువు తగ్గాలనుకునేవారికి బ్రహ్మాస్త్రం
జొన్నలలో ఫైబర్ (పీచు పదార్థం) అపారంగా ఉంటుంది. ఉదయాన్నే ఈ ఉప్మా ఒక
కప్పు తింటే చాలు, కడుపు నిండిన భావన కలుగుతుంది. మధ్యాహ్నం వరకు ఆకలి
వేయదు, చిరుతిళ్లు తినాలనే కోరిక చచ్చిపోతుంది. తద్వారా బరువు తగ్గడం
చాలా సులువవుతుంది.
జీర్ణవ్యవస్థకు మేలు
ఇందులోని పీచు పదార్థం మలబద్ధకం సమస్యను దరిచేరనివ్వదు. పేగుల
కదలికలను మెరుగుపరిచి జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. అంతేకాదు,
జొన్నలు గ్లూటెన్ ఫ్రీ ధాన్యం. గోధుమలు పడని వారు, సీలియాక్ వ్యాధి
ఉన్నవారు దీనిని నిరభ్యంతరంగా తినవచ్చు.
ఎముకలు, కండరాల బలం
జొన్నలలో క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి వయసు పైబడిన
వారిలో ఎముకలు అరిగిపోకుండా కాపాడతాయి. ఇక ఇందులో వేసిన పల్లీలు
శరీరానికి అవసరమైన మంచి ప్రోటీన్ ను అందించి, కండరాల
నిర్మాణానికి తోడ్పడతాయి.
రక్తహీనత నివారణ
ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్య రక్తహీనత. జొన్నలలో ఐరన్,
కాపర్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో ఎర్ర రక్త కణాల వృద్ధికి సహాయపడి
రక్తహీనతను దరిచేరనివ్వవు. నిమ్మకాయ (విటమిన్ సి) పిండటం వల్ల
జొన్నల్లోని ఐరన్ ను శరీరం వేగంగా గ్రహిస్తుంది.
గుండె పదిలం
జొన్నల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పల్లీల్లో ఉండే మోనో
అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు చాలా మంచివి. చెడు
కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను
పెంచుతాయి. కూరగాయలు చేర్చడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు,
ఖనిజాలు పుష్కలంగా అందుతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications