Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
జొన్నలతో రుచికరమైన బిర్యాని.. ఇలా చేసుకొని తింటే అమృతం కూడా పనికిరాదు!
చిరు ధాన్యాల్లో జొన్నలు కూడా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 దేశాల్లో ఈ జొన్నలను ఆహారపదార్థంగా వినియోగిస్తున్నారు. షుగర్ రోగులు ఈ జొన్నలను తినడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా ఈ జొన్నల వినియోగం అనేది పెరుగుతూ వస్తుంది. ఈ జొన్నలతో రొట్టెలు, జొన్న గట్కా, పేలాలు, అంబలి, అప్పడాలు కూడా చేసుకొని తింటుంటారు. అయితే సరికొత్తగా జొన్నలతో బిర్యానీ కూడా చేసుకొని తినొచ్చు. దీని రుచి అద్భుతంగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది.
జొన్నలతో బిర్యానీ ఏ విధంగా చేయాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? దీనిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జొన్న బిర్యానీకి కావాల్సిన పదార్థాలు
- ఒక గ్లాస్ జొన్న రవ్వ
- 50 గ్రాముల పచ్చి బాటని
- నాలుగు బంగాళాదుంపలు
- నాలుగు క్యారెట్లు
- రెండు ఉల్లిపాయలు
- రెండు కొత్తిమీర కట్టలు
- రెండు పుదీనా కట్టలు
- ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- మూడు యాలకులు
- రెండు లవంగాలు
- మూడు చిన్న దలచిన చెక్కలు
- రుచికి సరిపడా ఉప్పు
- మూడు స్పూన్ల నూనె
- ఒక స్పూన్ నెయ్యి
- కొన్ని జీడిపప్పు
- జొన్న రవ్వ తీసుకున్న గ్లాసుతో మూడు గ్లాసుల నీళ్లు
జొన్న బిర్యాని తయారీ విధానం
జొన్న బిర్యాని తయారు చేసుకోవడానికి ముందుగా బంగాళా దుంపలు, క్యారెట్లు, ఉల్లిపాయలలను శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే వాటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, దానిపై ఒక దళసరి గిన్నె పెట్టుకోవాలి. అందులో మూడు చెంచాల నూనె, నెయ్యి వేసుకోవాలి. నూనె, నెయ్యి వేడయ్యాక.. పైన పేర్కొనబడిన మసాలా దినుసులను అందులో వేసుకోవాలి. వాటితో పాటు పెద్ద పెద్దగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలను వేసుకోవాలి.
వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి బఠాణీలు, జీడిపప్పు వేసుకొని అన్నిటినీ ఓసారి కలుపుకొని వాటిని వేగనివ్వాలి. ఆ ముక్కలన్నీ బాగా వేగిన తరువాత ఆ మిశ్రమంలో ముందుగా తీసుకున్న మూడు గ్లాసుల నీళ్లను అందులో పోసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తరువాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక కప్పు జొన్న రవ్వను కూడా వేసుకోవాలి.
అనంతరం ఆ రవ్వను సన్నటి మంటపై ఉడకనివ్వాలి. ఇలా ఒక 20 నిమిషాల పాటు ఉడికిన తరువాత ఆ జొన్న బిర్యానీని కిందకు దించుకోవాలి. దించుకునే ముందు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అంతే ఏంతో రుచికరమైన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న బిర్యానీ సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












