Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
Kadapa special kushka: కడప స్పెషల్ 'కుష్కా'..ముద్ద ముద్దలో మజా..ఎలా చేసుకోవాలో చూడండి
ఎప్పుడూ చికెన్ బిర్యానీ,మటన్ బిర్యానీ తిని తిని బోర్ కొట్టేసిందా? కొత్తగా ఏదైనా వెరైటీ వంటకం చేసుకొని తినాలనిపిస్తుందా? అయితే ఓ సారి కడప స్పెషల్ కుష్కా(kushka) ట్రై చేయండి. కుష్కా చేయడం చాలా ఈజీ. దీనిని సింపుల్ గా ఇంట్లో చేసుకోవడం ఎలా,దీని తయారీకి ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం.
కడప స్పెషల్ కుష్కా తయారీకి కావల్సిన
పదార్థాలు
-బాస్మతి రైస్
-అల్లం
-వెల్లుల్లి
-నెయ్యి
-ఆయిల్
-ఉల్లిపాయలు
-ఉప్పు
-కారం
-పెరుగు
-పసుపు
-బిర్యానీ మసాలా పౌడర్
-గరం మసాలా పౌడర్
-కొత్తిమీర
-జీలకర్ర
-షాజీరా
-దాల్చిన చెక్క
-బిర్యానీ ఆకులు
-యాలకులు
-టమాటో
-ధనియాల పొడి

-ముందుగా ఒకటిన్నర గ్లాస్ బాస్మతి రైస్ ని అరగంట సేపు నానబెట్టుకోండి.
-తర్వాత మిక్సీ జార్ లో అల్లం,వెల్లుల్లి,పచ్చిమిర్చి,పుదీనా,కొత్తమీర వేసి పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఓ పాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తో పాటు కొంచెం నెయ్యి కూడా వేసి వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ స్పైసెస్ అంటే దాల్చిన చెక్క,బిర్యానీ ఆకులు,లవంగాలు,యాలకలు వేయండి.
-ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసిన రెండు ఉల్లిపాయలు,రుచికి సరిపడా ఉప్పు,జీలకర్ర,షాజీరా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
-తర్వాత అందులో ముందుగా మిక్సీలో వేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి కలపాలి. పచ్చివాసన పోయేంతవరకు మగ్గనివ్వాలి.
-తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటోలను కూడా వేసి మగ్గనివ్వాలి.
-తర్వాత అందులో అరకప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. స్టవ్ సిమ్ లో పెట్టి ఉంచాలి.
-ఇప్పుడు అందులోనే పసుపు,కారం, ధనియాల పొడి,బిర్యానీ మసాలా పౌడర్,గరం మసాలా పౌడర్ వేసి బాగా కలిపి 3 గ్లాస్ ల నీళ్లు అందులో పోయండి.
-నీళ్లు 10 నిమిషాలు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి 10 నిమిషాలు రైస్ ఉడికే వరకు వెయిట్ చేయండి.
-ఇప్పుడు మూత తీసి దాని మీద కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసి స్టవ్ ఆపేయండి. వేడి వేడి కుష్కా రెడీ.
-ఉల్లిపాయ ముక్కలు కొరుకతూ కుష్కాని తింటుంటే ఆ హాయి పదాల్లో చెప్పలేనిది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications