For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుమ్మడికాయ కూర తయారీ । పొడి గుమ్మడికాయ కూర । పేఠే కీ సబ్జీ రెసిపి

గుమ్మడికూర భారతదేశ సాంప్రదాయ వంటకం. దీన్ని ఉపవాసాలప్పుడు, పండగలకి ముఖ్యంగా తయారుచేస్తారు. చిత్రాలు, వీడియోతో కూడిన స్టెప్ బై స్టెప్ తయారీ విధానం చదవండి.

Posted By: Lekhaka
|

గుమ్మడికూర భారతదేశ సాంప్రదాయ వంటకం. దీన్ని ఉపవాసాలప్పుడు, పండగలకి ముఖ్యంగా తయారుచేస్తారు. దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా వండుతారు. మీరు గుమ్మడికాయ ప్రేమికులైతే, ఈ వేయించిన పొడి కూర మీ పొట్టకి విందుభోజనమవుతుంది.

గుమ్మడికాయ ముక్కలను రకరకాల మసాలా దినుసులతో కలిపి వండుతారు. దానివల్ల మంచి వాసన, రుచి కూరకి వస్తుంది. ఒక ముద్ద గుమ్మడికూరలో మీకు గుమ్మడికాయ తియ్యదనం, దినుసుల రకరకాల రుచులు ఒకేసారి తగులుతాయి.

గుమ్మడికాయకి అనేక ఆరోగ్య లాభాలు ఉంటాయి కనుక ఆరోగ్యం, రుచి కలిసిన ఈ కూర చాలా మంచిది.ఇది సులభంగా, త్వరగా వండేసేయవచ్చు. అందులో వాడే దినుసులు కూడా రోజువారీ ఇంట్లో వాడుకునేవే ఉంటాయి కనుక పెద్ద శ్రమ లేకుండానే కూర తయారయిపోతుంది.

ఈ రుచికరమైన గుమ్మడికాయ పొడికూరను వీడియో మరియు స్టెప్ బై స్టెప్ విధాన చిత్రాలతో నేర్చుకుని తయారుచేసుకోండి.

గుమ్మడికాయ కూర వీడియో రెసిపి

గుమ్మడికాయ కూర తయారీ । గుమ్మడికూర ఎలా వండాలి । పేఠేకీ సబ్జీ రెసిపి । కద్దూ తయారీ । తీయని పుల్లని కద్దూ తయారీ
గుమ్మడికాయ కూర తయారీ । గుమ్మడికూర ఎలా వండాలి । పేఠేకీ సబ్జీ రెసిపి । కద్దూ తయారీ । తీయని పుల్లని కద్దూ తయారీ
Prep Time
10 Mins
Cook Time
15M
Total Time
25 Mins

Recipe By: మీనా బంఢారి

Recipe Type: పక్కన కూర

Serves: నలుగురికి

Ingredients
  • గుమ్మడికాయ - 250గ్రాములు

    నూనె - 3చెంచాలు

    ఇంగువ - చిటికెడు

    జీలకర్ర - 1చెంచాడు

    మెంతులు - 3చెంచాలు

    అల్లం (తరిగినది) -1చెంచా

    రాళ్ల ఉప్పు రుచికి

    పసుపు - 1/2చెంచా

    కారం -1 చెంచా

    ధనియాలు -2చెంచాలు

    గరం మసాలా -1 చెంచా

    చక్కెర - 2చెంచాలు

    ఆమ్ చూర్ పొడి -1చెంచా

    పచ్చిమిర్చి -1/2 చెంచా

    కొత్తిమీర -1 చెంచా

How to Prepare
  • 1. ఒక గుమ్మడికాయ తీసుకుని, గింజలు తీసేసి, పెద్ద ముక్కలుగా తరగండి.

    2. పై తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి.

    3. వేడిపెనంలో నూనె వేయండి.

    4. ఇంగువ, జీలకర్ర వేయండి.

    5. మెంతులు కూడా వేసి వేగనివ్వండి.

    6. అల్లం మరియు తరిగిన గుమ్మడి ముక్కలు వేయండి.

    7. బాగా కలిపి 2 నిమిషాలు ఉడకనివ్వండి.

    8. రాళ్ళ ఉప్పు వేసి బాగా కలపండి.

    9. మూతపెట్టి మధ్య మంటపై 2 నిమిషాలు ఉడకనివ్వండి.

    10. మూత తీసేసి, పసుపు వేయండి.

    11. కారం, ధనియాల పొడి వేయండి.

    12. గరం మసాలా, చక్కెర కూడా వేయండి.

    13. అన్నిటినీ బాగా కలిపి మూతపెట్టండి.

    14. 5-7 నిమిషాలు ఉడకనివ్వండి.

    15. మూత తీసి ఆమ్ చూర్ పొడి వేయండి.

    16. ఇక పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా కలపండి.

    17. స్టవ్ ఆపేసి వడ్డించండి.

Instructions
  • 1. ఉపవాసానికి కాకపోతే,రాళ్ళ ఉప్పు బదులు మామూలు ఉప్పు కూడా వాడవచ్చు.
  • 2. పంచదార బదులు బెల్లం కూడా వాడవచ్చు.
  • 3. గుమ్మడి గింజలు పడేసేకన్నా దాచిపెట్టండి. వాటిని పొడిగా వేయించి సలాడ్లు, అల్పాహారాలలో తినవచ్చు. వాటికి చాలా ఆరోగ్యలాభాలున్నాయి.
Nutritional Information
  • వడ్డించే పరిమాణం - 1 కప్పు
  • క్యాలరీలు - 56 కాలరీలు
  • కొవ్వు - 2గ్రాములు
  • ప్రొటీన్ - 2 గ్రాములు
  • కార్బొహైడ్రేట్లు - 11 గ్రాములు
  • చక్కెర - 6గ్రాములు
  • ఫైబర్ - 2గ్రాములు

స్టెప్ బై స్టెప్ - గుమ్మడికాయ కూర ఎలా వండాలి

1. ఒక గుమ్మడికాయ తీసుకుని, గింజలు తీసేసి, పెద్ద ముక్కలుగా తరగండి.

2. పై తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి.

3. వేడిపెనంలో నూనె వేయండి.

4. ఇంగువ, జీలకర్ర వేయండి.

5. మెంతులు కూడా వేసి వేగనివ్వండి.

6. అల్లం మరియు తరిగిన గుమ్మడి ముక్కలు వేయండి.

7. బాగా కలిపి 2 నిమిషాలు ఉడకనివ్వండి.

8. రాళ్ళ ఉప్పు వేసి బాగా కలపండి.

9. మూతపెట్టి మధ్య మంటపై 2 నిమిషాలు ఉడకనివ్వండి.

10. మూత తీసేసి, పసుపు వేయండి.

11. కారం, ధనియాల పొడి వేయండి.

12. గరం మసాలా, చక్కెర కూడా వేయండి.

13. అన్నిటినీ బాగా కలిపి మూతపెట్టండి.

14. 5-7 నిమిషాలు ఉడకనివ్వండి.

15. మూత తీసి ఆమ్ చూర్ పొడి వేయండి.

16. ఇక పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా కలపండి.

17. స్టవ్ ఆపేసి వడ్డించండి.

[ 3.5 of 5 - 65 Users]
English summary

గుమ్మడికాయ కూర తయారీ । గుమ్మడికూర ఎలా వండాలి । పేఠేకీ సబ్జీ రెసిపి । కద్దూ తయారీ । తీయని పుల్లని కద్దూ తయారీ

Kaddu ki sabzi is a traditional dish prepared specifically during vrats and festivals. Have a look at the petha sabzi video recipe
Desktop Bottom Promotion