Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
kakarakaya curry: కాకరకాయ కర్రీ..ఇలా చేశారంటే జన్మలో మర్చిపోలేని టేస్ట్
కాకరకాయ పేరు వింటేనే కొంతమంది యాక్ అని అంటుంటారు. వాస్తవానికి కాకారకాయని వండే విధంగా వండితే వెజ్ కర్రీలలో దీనికి మించిన టేస్ట్ మరోదానికి రాదు. అంతేకాకుండా దీనిని తినడం వల్ల అనేక రకాలుగా మన శరీరానికి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాకరకాయ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
కాకరకాయ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-కాకరకాయ
-ఉప్పు
-కారం
-పసుపు
-ఆయిల్
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-కరివేపాకు
-ఉల్లిపాయ
-టమాటో
-జీలకర్ర పొడి
-మెంతుల పొడి
-చింతపండు

కాకరకాయ కర్రీ తయారీ విధానం
-పావు కేజీ కాకరగాయలను తీసుకోండి. చాకుతో వాటిమీద ఉండే బుడుపులను లైట్ గా తీసేయండి.
-తర్వాత కాకరకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి వాటిని ఓ బౌల్ లో వేసి అందులో 1 టీస్పూన్ ఉప్పు,పావు టీ స్పూన్ పసుపు వేసి మొత్తం బాగా కలిసేటట్లు కలుపి మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కనపెట్టుకోండి.
-10 నిమిషాల తర్వాత కాకరకాయ ముక్కలను చేతుల్లోకి తీసుకొని బాగా పిసికి వాటిని మరో ఓ బౌల్ లోకి తీసుకోండి.
-తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది వేడెక్కిన తర్వాత అందులో కాకరకాయ ముక్కలు వేసి మంటను మీడియం ప్లేమ్ లో పెట్టి లైట్ గా కలర్ మారేంతవరకు వేయించి వాటిని ఓ బౌల్ లోకి తీసుకొని పక్కపెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో మిగిలిఉన్న నూనెలో 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు,పొడవుగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా కట్ చేసిన 1 ఉల్లిపాయను,కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోండి.
-ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత అందులో 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోండి. ఆ తర్వాత ఇందులో మీడియం సైజ్ లో కట్ చేసిన 1 టమాటో వేసి టమాటో ముక్కలు మొత్తగా ఉడికేవరకు వేగనివ్వాలి.
-తర్వాత అందులో కారం,పసుపు,ధనియాల పొడి,జీలకర్ర పొడి వేసి ఇవన్నీ వేసి కలుపుకోండి. తర్వాత ఇందులోనే 10 నిమిషాలు నానబెట్టిన నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని,1 కప్పు నీళ్లు, రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోండి. తర్వాత కాకరకాయ ముక్కలను ఇందులో వేసి పాన్ పై మూతపెట్టేసి మంటను లో ప్లేమ్ లో ఉంచండి.
-సగం వేగితన తర్వాత ఇందులో వేయించి పొడి చేసిన మెంతుల పొడి వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఉడకనివ్వాలి. అంతే కాకరకాయ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications