Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
కాకరకాయ కొత్తిమీర కారం..ముద్ద ముద్దలో స్వర్గం కనబడతది,ఇలా చేసుకోవాలి
కాకరకాయ పేరు ఎత్తగానే చాలామంది ముఖం పక్కకు తిప్పేస్తారు. కాకరకాయ చేదుగా ఉంటదని దీని జోలికి పోరు. అయితే సరైన పద్దతిలో చేస్తే కాకరకాయని మించిన టేస్ట్ మరి దేనికి రాదు. కాకరకాయ కొత్తిమీరతో చేసే కారం వేడి వేడి అన్నంలో తింటి ఇంక అద్భుతంగా ఉంటుంది. కాకరకాయ కొత్తిమీర కారం చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. కాకరకాయ కొత్తిమీర కారం చేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
కాకరకాయ కొత్తిమీర కారం తయారీకి కావాల్సిన పదార్థాలు
-500 గ్రాముల కాకరకాయలు
-1/4 కప్పు ఆయిల్
-2 టేబుల్ స్పూన్ల పల్లీలు
-అర టీ స్పూన్ ఆవాలు
-అర టీస్పూన్ జీలకర్ర
-ఉసిరికాయ సైజ్ చింతపండు
-కొంచెం బెల్లం
-ఇంచు అల్లం
-5 పచ్చిమిరపకాయలు
-100 గ్రాముల కొత్తిమీర
-ఉప్పు
-పసుపు
-1 ఉల్లిపాయ

కాకరకాయ కొత్తిమీర కారం తయారీ విధానం
-అరకేజీ కాకరకాయలను చెక్కు తీసి లోపల గింజలను కూడా తీసేసి మీకు నచ్చిన షేపులో చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
-కట్ చేసిన ముక్కల్లో ఉప్పు,పసుపు వేసి అరగంట సేపు ఊరనివ్వాలి.
-తర్వాత ముక్కలను చేతుల్లోకి తీసుకొని పిండి వాటిని ఓ బౌల్ లో వేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం ఆయిల్ పోసి అందులో పల్లీలు వేసి వేయించి పక్కన పెట్టుకోండి. అదే నూనెలో ఆవాలు,జీలకర్ర వేసి చిట్లనివ్వాలి.
-అందులో పసరు పిండిన కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయ చీలికలు వేసి నిదానంగా వేగనివ్వాలి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో కాడలతో సహా కొత్తిమీర,చింతపండు, పచ్చిమిరపకాయలు, అల్లం వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత అందులో వేయించిన పల్లీలు, కొంచెం నీళ్లు వేసి ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. బరకగా చేసుకోండి.
-తర్వాత వేగిన కాకరకాయ ముక్కల్లో మిక్సీలో చేసుకున్న మిశ్రమాన్ని,కొంచెం బెల్లం వేసి బాగా కలపండి. మూతపెట్టి నాలుగు నిమిషాలు వేగనివవ్వాలి. అంతే కాకరకాయ కొత్తిమీర కారం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications