కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్

Posted By:

కర్ణాటక వంటకాల్లో మసాలా చిత్రాన్నం చాలా ఫేమస్. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ టైం నుంచి నైట్ డిన్నర్ టైం దాకా ఇది హోటల్స్ లో అందుబాటులో ఉంటుంది. చాలామంది అక్కడ తమ ఇళ్లల్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా దీన్ని చేసుకుంటారు. లంచ్ బాక్సులకు ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. కేవలం 15 నిమిషాల్లోనే ఇది రెడీ అయిపోతుంది.

ఆఫీసులకు వెళ్లేవారికి, బ్యాచిలర్స్ కు ఫటాఫట్ చేసుకోడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఉల్లిపాయ, వెల్లుల్లి వాడకపోయినా దీని టేస్ట్ మస్త్ ఉంటుంది. ఈ మసాలా చిత్రాన్నంని ఇంటికో తీరులో, చేతికో తీరులో తయారుచేస్తుంటారు. ఇందులో వాడే ప్రతి పదార్థాం ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేసేవే. కర్ణాటక ఫేమస్ మసాలా చిత్రాన్నం ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Karnataka Special Masala Chitrannam Recipe in Telugu Quick Tasty Lunchbox Recipe in Just 15 Minutes

కావాల్సిన పదార్థాలు

-ఎండుకొబ్బరి
-పచ్చిమిర్చి
-ఎండు కరివేపాకు
-కొత్తిమీర
-పసుపు
-ఉప్పు
-జీలకర్ర
-ఆయిల్
-వేరుశెనగపప్పు
-జీడిపప్పు
-వండిన అన్నం

దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు

తయారీ విధానం

-ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోండి.

-తర్వాత మిక్సీ జార్ లో ఎండు కొబ్బరి ముక్కలు లేదా రెండు దోసిళ్ల ఎండు కొబ్బరి తురుము, 6 పచ్చిమిరపకాయలు, ఎండిన కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర, జీలకర్ర, చిటికెడు పసుపు, 1 స్పూన్ రాళ్ల ఉప్పు వేసి మొత్తాన్ని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోండి.

-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక అందులో కొద్దిగా ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత అందులో వేరుశెనగపప్పు, జీడిపప్పు వేసి అవి కొంచెం కలర్ మారాక అందులో 7 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి వేయించాక గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో కలుపుకోండి.

-తర్వాత స్టవ్ ఆపేసి వేయించిన మిశ్రమం మొత్తం ఉడికించిన అన్నంలో వేసి కలుపుకోండి. చివరగా కావాలనుకుంటే ఇందులో కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చు.

-అంతే కర్ణాటక ఫేమస్ మసాలా చిత్రాన్నం రెడీ. గంటల తర్వాత కూడా ఈ మసాలా చిత్రాన్నం చాలా బాగుంటుంది.

[ of 5 - Users]
Story first published: Monday, October 19, 2026, 9:27 [IST]
Desktop Bottom Promotion