Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు!
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
రోజూ ఒకే రకమైన ఎర్రటి, మసాలా బిర్యానీలు తిని మీకు విసుగొచ్చేసిందా? అయితే ఈసారి మీరు ఇంట్లో బిర్యానీ చేయాలనుకున్నప్పుడు కర్ణాటక స్టైల్ స్పెషల్ గ్రీన్ చికెన్ బిర్యానీని (దీనినే దొన్నె బిర్యానీ అని కూడా అంటారు) ట్రై చేయండి. ఆకుపచ్చ రంగులో కంటికి ఇంపుగా, కడుపుకు నింపుగా ఉండే ఈ బిర్యానీ కర్ణాటక అంతటా చాలా ఫేమస్. వంట రాని బ్యాచిలర్స్ సైతం ఎలాంటి కష్టం లేకుండా ఈ వంటకాన్ని ఈజీగా వండేయొచ్చు.

దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
గ్రీన్ చికెన్ బిర్యానీ తయారీకి కావలసిన పదార్థాలు
బోన్ లెస్ లేదా ఎముకలతో ఉన్న చికెన్ - 1 కిలో
పెరుగు - పావు కప్పు
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
పుదీనా ఆకులు - పావు కప్పు
కొత్తిమీర ఆకులు - పావు కప్పు
కరివేపాకు - 2 కట్టలు
పచ్చిమిర్చి - 6
అల్లం - 1 అంగుళం ముక్క
వెల్లుల్లి - 2 రెబ్బలు
కసూరి మేతి - 1 టీస్పూన్
నీళ్లు - పావు కప్పు
జీరా సాంబ బియ్యం- 2 కప్పులు
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
కొబ్బరి నూనె - 3 టేబుల్ స్పూన్లు
బిర్యానీ ఆకు - 1
మరాఠీ మొగ్గలు - 2
సోంపు - అర టీస్పూన్
అనాస పువ్వు - 1
లవంగాలు - 2
యాలకులు - 2
దాల్చిన చెక్క - 2 ముక్కలు.
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
బిర్యానీ మసాలా పొడి - 1 టేబుల్ స్పూన్
కర్రీ మసాలా పొడి - 1 టేబుల్ స్పూన్
మిరియాల పొడి - పావు టేబుల్ స్పూన్
ధనియాల పొడి - ఒకటిన్నర టేబుల్ స్పూన్
వేడి నీళ్లు - 4 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
నిమ్మకాయ రసం - సగం చెక్క
డీప్ ఫ్రై లేకుండానే KFC స్టైల్ పాప్ కార్న్ చికెన్.. మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా

గ్రీన్ చికెన్ బిర్యానీ తయారీ విధానం
-ముందుగా జీరా సాంబ బియ్యాన్ని శుభ్రంగా కడిగి కనీసం 30 నిమిషాల పాటు నానబెట్టుకోండి.
-ఈ బిర్యానీకి ఎముకలతో ఉన్న చికెన్ వాడితే ఆ రుచి అన్నానికి పట్టి బిర్యానీ అద్భుతంగా వస్తుంది. చికెన్ ముక్కలను శుభ్రం చేసి, అందులో పెరుగు, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకోండి.
-ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని.. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కసూరి మేతి వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని గ్రీన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.
-స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి నెయ్యి, కొబ్బరి నూనె వేడి చేయండి. అందులో బిర్యానీ ఆకు, సోంపు, యాలకులు తదితర మసాలా దినుసులు వేసి వేయించండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా, మెత్తబడే వరకు మగ్గనివ్వాలి.
-ఉల్లిపాయలు వేగాక అందులో ముందుగా గ్రైండ్ చేసిన గ్రీన్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా 3-4 నిమిషాలు ఉడికించండి. తర్వాత బిర్యానీ మసాలా, కర్రీ పౌడర్, మిరియాల పొడి, ధనియాల పొడి వేసి ఓ నిమిషం పాటు వేయించాలి.
-ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వేసి మసాలా బాగా పట్టేలా కలపండి. కుక్కర్ మూతను పైపైన పెట్టి మీడియం మంట మీద 10 నిమిషాలు ఉడికించండి. అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్ ఉడికేటప్పుడు నీళ్లు పోయకూడదు.
-చికెన్ కాస్త ఉడికాక, అందులో నానబెట్టి నీళ్లు వంపేసిన బియ్యం వేయండి. ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల చొప్పున 4 కప్పుల వేడి నీళ్లు పోసి కలపండి. తగినంత ఉప్పు, నిమ్మరసం పిండి ఒకసారి బాగా కలిపి నీటిని మరగనివ్వండి.
-నీరు మరుగుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టి, రెండు విజిల్స్ రానివ్వండి. ఆ తర్వాత మంటను పూర్తిగా తగ్గించి సుమారు 20 నిమిషాల పాటు సన్నని మంట మీద దమ్ చేయండి.
-కుక్కర్ ఆవిరి పోయాక మూత తీసి చూస్తే.. కమ్మటి సువాసనలతో నోరూరించే కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ రెడీ. దీన్ని చల్లటి రైతా, ఉడికించిన గుడ్డుతో కలిపి వేడివేడిగా తింటుంటే స్వర్గమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications