Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఆదివారం స్పెషల్: నోరూరించే కర్ణాటక స్టైల్ నాటు కోడి కూర రెసిపీ ఇదే!
బ్రాయిలర్ కోడికన్నా, అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నాటు కోడి తినేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు. ఈ వారం మీ ఇంట్లో కూడా మాంసాహారం వండబోతున్నారా? మీరు తరచుగా నాటు కోడి కొంటుంటారా? అయితే రొటీన్ కి భిన్నంగా ఈ వారం కర్ణాటక స్టైల్ లో నాటు కోడి కూర తయారు చేసి చూడండి.

ఈ కర్ణాటక స్పెషల్ చికెన్ కర్రీ ప్రత్యేకత ఏమిటంటే.. అప్పటికప్పుడు తాజా మసాలా దినుసులను ప్రత్యేకంగా నూరి వండటమే. అందుకే దీని రుచి అద్భుతంగా ఉంటుంది. వేడి అన్నంతోనే కాకుండా ఇడ్లీ, దోసె, చపాతీ, పూరీలతో కూడా ఈ గ్రేవీ పర్ఫెక్ట్ కాంబినేషన్.
కర్ణాటక స్టైల్ నాటు కోడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు
మసాలా తయారీకి:
నూనె - 1 టేబుల్ స్పూన్
మిరియాల పొడి - 1 టేబుల్ స్పూన్
సోంపు - అర టేబుల్ స్పూన్
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
లవంగాలు - 6
దాల్చిన చెక్క- అర అంగుళం
మెంతులు - 1/8 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు
పచ్చిమిరపకాయలు - 10
అల్లం - 1 అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 10
తురిమిన కొబ్బరి - అర కప్పు
కొత్తిమీర ఆకులు - పావు కప్పు
ఇతర పదార్థాలు:
నాటు కోడి - అర కిలో
నూనె - 3 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - 2 కట్టలు
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
టమాటాలు - 2
పసుపు పొడి - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా

కర్ణాటక స్టైల్ నాటు కోడి కూర తయారీ విధానం
-ముందుగా ఒక బాండీలో ఒక చెంచా నూనె వేసి పొడి మసాలాలతో పాటు వెల్లుల్లి, అల్లం వేయాలి. మసాలాలు సువాసన వెదజల్లి, వెల్లుల్లి గోధుమ రంగులోకి మారే వరకు 3-4 నిమిషాల పాటు తక్కువ మంట మీద వేయించుకోవాలి. మసాలా దినుసులు మాడిపోకుండా తక్కువ మంట మీద నెమ్మదిగా వేయించడం ముఖ్యం. వేయించిన ఈ పదార్థాలను ఒక ప్లేట్ లోకి తీసి చల్లారనివ్వాలి.
-అదే బాండీలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి మెత్తబడే వరకు కొన్ని నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత వాటిని బయటకు తీసి చల్లారనివ్వాలి.
-ఇప్పుడు అదే బాండీలో తురిమిన కొబ్బరి, కొత్తిమీర ఆకులు వేసి ఆకులు ముడుచుకునే వరకు కొన్ని సెకన్ల పాటు వేయించి చల్లారనివ్వాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారాక, మిక్సీలో వేసి సుమారు ఒక కప్పు నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేయాలి. అందులో కరివేపాకు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేయాలి. ఉప్పు, పసుపు పొడి వేసి కొన్ని నిమిషాలు వేయించాలి. పాత్రపై మూత పెట్టి మీడియం మంట మీద ఉడికించాలి. తర్వాత శుభ్రంగా కడిగిన నాటు కోడి ముక్కలు వేసి, మాంసానికి మసాలాలు బాగా పట్టేలా కలపాలి. తర్వాత రుబ్బిన మసాలా పేస్ట్ కలపాలి. మిక్సీ గిన్నెను బాగా కడిగి, ఆ నీళ్లు పాన్ లో పోయాలి. చికెన్ ఉడకడానికి అవసరమైనంత అదనపు నీటిని కలపాలి. కుక్కర్‌కు మూత పెట్టి,సుమారు అరగంట పాటు చాలా తక్కువ మంట మీద ఉడికించాలి.
-గ్రేవీని మీడియం మంట మీద అరగంట పాటు ఉడకనివ్వండి. గిన్నె అడుగున మాడిపోకుండా తగినంత నీరు ఉండేలా చూసుకోండి. గ్రేవీ బాగా మరిగి, కూర చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయండి.
-అంతే ఎంతో రుచికరమైన కర్ణాటక స్టైల్ నాటు కోడి కూర రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications