Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
Kashmir Pink Tea: కాశ్మీరీ పింక్ టీ.. చిటికెలో ఇలా చేసుకోండి! ఆరోగ్యానికి చాలా మంచిది!
మన దేశంలో టీకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దేశంలోని ప్రతీ ప్రాంతంలో టీ తాగుతూనే ఉంటారు. అలాగే మన దేశంలో ఎన్నో రకాల టీలు కూడా ఉన్నాయి. అల్లం చాయ్ మొదలు, పింక్ టీ వరకు చాలా రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. ఈ పింక్ టీ అనేది చాలా ఆకర్షణీయంగా కనిపించే టీ. దీని రంగు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీని తయారీ విధానంలో ఈ టీ రంగు మారిపోతుంది. ఈ టీ తయారీలో ప్రధానంగా గ్రీన్ టీని ఉపయోగిస్తారు.
కొన్ని సుగంధ ద్రవ్యాలు, పుదీనా ఆకులను కూడా ఇందులో వినియోగిస్తారు. ఈ టీని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. ఇంతకీ ఈ టీని ఎలా తయారు చేస్తారు, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పింక్ టీ తయారీకి కావాల్సిన పదార్థాలు
- గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ
- నీరు
- పంచదార లేదా హనీ
- పుదీనా ఆకులు
- లెమన్ గ్రాస్
- ఇతర సుగంధ ద్రవ్యాలు
- కొంచెం బేకింగ్ సోడా
పింక్ తయారీ విధానం
ఈ పింక్ టీని తయారు చేసుకోవడానికి, ముందుగా ఒక పాత్రలో నీటిని మరిగించాలి. దానిలో గ్రీన్ టీని వేసుకొని కొంచెంసేపు మరిగించుకోవాలి. ఆ తర్వాత అందులో కొన్ని పుదీనా ఆకులు, లెమన్ గ్రాస్, ఇతర సుగంధ ద్రవ్యాలను ఇందులో జత చేసుకోవాలి. ఆ మిశ్రమం మొత్తాన్ని ఒక ఉలుకు వచ్చే విధంగా ఉడికించుకోవాలి. అనంతరం చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని కలుపుకొని కాసేపు మరిగించుకోవాలి. ఇలా బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల టీ రంగు మారిపోతుంది. ఆ టీని వడకట్టుకొని, గ్లాసులో తీసుకొని అందులో షుగర్ లేదా హనీ వేసుకొని తాగొచ్చు.
పింక్ టీతో ఆరోగ్య ప్రయోజనాలు
ఈ పింక్ టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ టీలో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.
ఈ పింక్ టీలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలం అందిస్తాయి. అలాగే ఎముకలను బలంగా తయారు చేస్తాయి. ఈ పింక్ టీ వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. ఇది రక్తంలోని చెడు కొవ్వును దూరం చేస్తుంది. దీని కారణంగా రక్తనాళాలు పరిశుభ్రంగా ఉంటాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే గుండె పనితీరు మెరుగై, గుండె సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.
ఈ పింక్ తాగడం వల్ల జీర్ణ సమస్యలు తొలిగిపోతాయి. తిన్న ఆహరం శుభ్రంగా జీర్ణం అవుతుంది. అలాగే బరువు తగ్గేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఈ పింక్ టీలో థియానిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది. మనసును ప్రశాంతంగా మారుస్తుంది. అలాగే ఇందులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికారకమైన కణాలను నశింపజేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications