For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాయీ హోలిగే రెసిపి । నారియల్ పూరన్ పోలి రెసిపి । కొబ్బరి ఒబ్బట్టు తయారీ

కాయి హోలిగే కర్ణాటక రాష్ట్ర సాంప్రదాయ తీపి వంటకం. దీన్ని పండగలకి ప్రత్యేకంగా చేసుకుంటారు. కాయి హోలిగే రెసిపి – చిత్రాలు, వీడియో మరియు స్టెప్ బై స్టెప్ విధానం

Posted By: Lekhaka
|

కాయి హోలిగే కర్ణాటక రాష్ట్ర సాంప్రదాయ తీపి వంటకం. దీన్ని పండగలకి ప్రత్యేకంగా చేసుకుంటారు. దీన్ని కొబ్బరి పోలి అని కూడా అంటారు. కొబ్బరి తురుము, బెల్లం కలిపి వండుతారు.

కొబ్బరి ఒబ్బట్టు దక్షిణాది ప్రత్యేక వంటకమైతే, బేలే ఒబ్బట్టు లేదా పూరన్ పోలి మహారాష్ట్ర నుంచి వచ్చాయి. రెండిటి మధ్య ముఖ్యమైన బేధం లోపల కూరే పదార్థం.
లోపల తీయని బెల్లం పదార్థం కూరబడి, పైన మెత్తని పొరలతో ఎంతో రుచిగా ఉంటుంది. కాయి హొలిగేను సాధారణంగా ఇంట్లో పెద్దవారు చేస్తారు ఎందుకంటే ఇదంత కష్టం కాబట్టి. కావాల్సిన పదార్థాల పరిమాణాలు, విధానం సరిగా అనుసరించకపోతే మొత్తం పాడయిపోతుంది.

అందుకని మీరు ఇంట్లో దీన్ని ప్రయత్నించాలనుకుంటే, వీడియో, చిత్రాలతో కూడిన మా ఈ విధానాన్ని చూసి చేయండి.

కాయీ హోలిగే రెసిపి । నారియల్ పూరన్ పోలి రెసిపి । కొబ్బరి ఒబ్బట్టు తయారీ । కొబ్బరి బొబ్బట్టు రెసిపి
కాయీ హోలిగే రెసిపి । నారియల్ పూరన్ పోలి రెసిపి । కొబ్బరి ఒబ్బట్టు తయారీ । కొబ్బరి బొబ్బట్టు రెసిపి
Prep Time
5 Hours
Cook Time
1H
Total Time
6 Hours

Recipe By: కావ్యశ్రీ ఎస్

Recipe Type: స్వీట్లు

Serves: 4

Ingredients
  • రవ్వ ( చిరోటి రవ్వ) - 1 కప్పు

    మైదా - ½ కప్పు

    పసుపు - ¼ కప్పు

    నీరు - 1 ½ కప్పు

    తురిమిన కొబ్బరి 1 బౌల్

    బెల్లం - 1 కప్పు

    ఏలకుల పొడి -1/2 చెంచా

    నూనె -8 చెంచాలు +1 కప్

    ప్లాస్టిక్ పేపరు

How to Prepare
  • 1. కలిపే గిన్నెలో రవ్వను వేయండి.

    2. మైదా, పసుపును వేయండి.

    3. బాగా కలపండి.

    4. 2 చెంచాల నూనెను వేయండి.

    5. అప్పుడు, ముప్పావు వంతు నీరును కొద్దికొద్దిగా పోసి, మెత్తని పిండిలా మర్దించండి.

    6. రెండుచెంచాల నూనెను వేసి మళ్ళీ 5 నిమిషాల పాటు కలపండి.

    7. మళ్ళీ 4 చెంచాల నూనెను వేయండి.

    8.దాని మీద మూతపెట్టి ఐదుగంటలు నానబెట్టండి.

    9. మిక్సీ జార్ లో తురిమిన కొబ్బరిని వేయండి.

    10. పావుకప్పు నీరు పోయండి.

    11. మెత్తని పిండిలా చేసి పక్కన పెట్టుకోండి.

    12. బెల్లాన్ని వేడి పెనంలో వేయండి.

    13. వెంటనే, 1/4వ కప్పు నీరు పోయండి.

    14. బెల్లాన్ని కరిగించి 5 నిమిషాలపాటు ఉడికించండి.

    15. రుబ్బిన పేస్టును పెనంలో వేయండి.

    16. మాడిపోకుండా కలుపుతూనే ఉండండి.

    17. 10-15 నిమిషాలు పెనంలోంచి మిశ్రమం బయటకి వచ్చేసేదాకా ఉడకనివ్వండి.

    18. ఏలకుల పొడిని వేసి బాగా కలపండి.

    19. మిశ్రమాన్ని 10 నిమిషాలపాటు చల్లబడనివ్వండి.

    20. అది మొత్తం చల్లబడ్డాక, చిన్న చిన్న ఉండలుగా కట్టుకోండి.

    21. పూరీలు వత్తుకునే రాయిని తీసుకోండి.

    22. దానిపై ప్లాస్టిక్ పేపర్ ను వేయండి.

    23.దానికి నూనె రాసి జిడ్డు చేయండి.

    24. కొంచెం మధ్యసైజు పిండిముద్ద తీసుకుని మరింత వత్తండి.

    25. మీ అరచేయిలో వత్తుతూ మధ్యలో కూరే తీపి పదార్థాన్ని పెట్టండి.

    26. ఖాళీలేకుండా పైనంతా మూసేసి, సరిగా అంచులు వత్తండి.

    27. ప్లాస్టిక్ పేపరుపై పెట్టి చేత్తో మరింత వత్తండి.

    28. అప్పడాల కర్రతో వత్తండి.

    29. రోటీలలాగా అప్పడాల కర్రతో వత్తండి.

    30. పెనాన్ని వేడిచేయండి.

    31. పెనంపై ఉన్న కాగితంతో సహా బొబ్బట్టును తిరగేసి కాగితం జాగ్రత్తగా తీసేయండి.

    32. ఒకవైపు ఉడకనిచ్చాక, మరోవైపు కొంచెం నూనె చుక్కలు వేయండి.

    33. మళ్ళీ తిరగేసి గోధుమరంగులోకి మారేవరకు వేయించండి.

Instructions
  • 1. మీరు ఎంత పిండిని మర్దిస్తే అంత మెత్తగా హోలిగేలు వస్తాయి.
  • 2. లోపల కూరేది హల్వాలో లాగా పెనం బయటకి వచ్చేస్తూ మధ్యలో గడ్డకడుతున్నంతవరకూ ఉడికించాలి.
Nutritional Information
  • వడ్డించే పరిమాణం - 1 ముక్క
  • క్యాలరీలు - 256 క్యాలరీలు
  • కొవ్వు - 11 గ్రాములు
  • ప్రొటీన్ - 2 గ్రాములు
  • కార్బొహైడ్రేట్లు - 35 గ్రాములు
  • చక్కెర - 23 గ్రాములు

తయారీ విధానం

1. కలిపే గిన్నెలో రవ్వను వేయండి.

2. మైదా, పసుపును వేయండి.

3. బాగా కలపండి.

4. 2 చెంచాల నూనెను వేయండి.

5. అప్పుడు, ముప్పావు వంతు నీరును కొద్దికొద్దిగా పోసి, మెత్తని పిండిలా మర్దించండి.

6. రెండుచెంచాల నూనెను వేసి మళ్ళీ 5 నిమిషాల పాటు కలపండి.

7. మళ్ళీ 4 చెంచాల నూనెను వేయండి.

8.దాని మీద మూతపెట్టి ఐదుగంటలు నానబెట్టండి.

9. మిక్సీ జార్ లో తురిమిన కొబ్బరిని వేయండి.

10. పావుకప్పు నీరు పోయండి.

11. మెత్తని పిండిలా చేసి పక్కన పెట్టుకోండి.

12. బెల్లాన్ని వేడి పెనంలో వేయండి.

13. వెంటనే, 1/4వ కప్పు నీరు పోయండి.

14. బెల్లాన్ని కరిగించి 5 నిమిషాలపాటు ఉడికించండి.

15. రుబ్బిన పేస్టును పెనంలో వేయండి.

16. మాడిపోకుండా కలుపుతూనే ఉండండి.

17. 10-15 నిమిషాలు పెనంలోంచి మిశ్రమం బయటకి వచ్చేసేదాకా ఉడకనివ్వండి.

18. ఏలకుల పొడిని వేసి బాగా కలపండి.

19. మిశ్రమాన్ని 10 నిమిషాలపాటు చల్లబడనివ్వండి.

20. అది మొత్తం చల్లబడ్డాక, చిన్న చిన్న ఉండలుగా కట్టుకోండి.

21. పూరీలు వత్తుకునే రాయిని తీసుకోండి.

22. దానిపై ప్లాస్టిక్ పేపర్ ను వేయండి.

23.దానికి నూనె రాసి జిడ్డు చేయండి.

24. కొంచెం మధ్యసైజు పిండిముద్ద తీసుకుని మరింత వత్తండి.

25. మీ అరచేయిలో వత్తుతూ మధ్యలో కూరే తీపి పదార్థాన్ని పెట్టండి.

26. ఖాళీలేకుండా పైనంతా మూసేసి, సరిగా అంచులు వత్తండి.

27. ప్లాస్టిక్ పేపరుపై పెట్టి చేత్తో మరింత వత్తండి.

28. అప్పడాల కర్రతో వత్తండి.

29. రోటీలలాగా అప్పడాల కర్రతో వత్తండి.

30. పెనాన్ని వేడిచేయండి.

31. పెనంపై ఉన్న కాగితంతో సహా బొబ్బట్టును తిరగేసి కాగితం జాగ్రత్తగా తీసేయండి.

32. ఒకవైపు ఉడకనిచ్చాక, మరోవైపు కొంచెం నూనె చుక్కలు వేయండి.

33. మళ్ళీ తిరగేసి గోధుమరంగులోకి మారేవరకు వేయించండి.

[ 5 of 5 - 44 Users]
English summary

Kayi Holige Recipe | Nariyal Puran Poli Recipe | Kobbari Obbattu Recipe | Coconut Puran Poli Recipe। కాయీ హోలిగే రెసిపి । నారియల్ పూరన్ పోలి రెసిపి । కొబ్బరి ఒబ్బట్టు తయారీ । కొబ్బరి బొబ్బట్టు రెసిపి

Kayi holige is a traditional Karnataka-style sweet recipe that is prepared for most festivals. Watch the video recipe and follow the step-by-step procedur
Desktop Bottom Promotion