Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
టిఫిన్స్ లోకి కేరళ స్పెషల్ కొబ్బరి చట్నీ..రెండు తినే వారు నాలుగు ఇడ్లీలు లాగించేస్తారు!
మన దక్షిణ భారతీయుల ఇళ్లలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి ఇడ్లీ, దోశలే. వీటిల్లోకి రోజూ పల్లీల చట్నీ, రొటీన్ కొబ్బరి చట్నీ, లేదా టమాటా, కారం చట్నీలు చేస్తుంటారు. ప్రతిరోజూ అవే చట్నీలు తిని విసుగొచ్చేసిందా? అయితే కేరళ శైలి కొబ్బరి చట్నీని తయారు చేసి చూడండి.

ఇది తయారు చేయడం చాలా సులభం, ఎక్కువ సమయం కూడా పట్టదు. దీని కమ్మని రుచికి ఫిదా అయిపోతారు. మామూలుగా రెండు ఇడ్లీలు తినే వారు సైతం ఈ చట్నీ రుచికి కచ్చితంగా మరో రెండు ఇడ్లీలు లాగించేస్తారు. కేరళ స్టైల్ కొబ్బరి చట్నీ మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కేరళ స్టైల్ కొబ్బరి చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు
వంటకు వాడే కొబ్బరి నూనె - 2 టేబుల్ స్పూన్లు
సాంబార్ ఉల్లిపాయలు - అర కప్పు
వెల్లుల్లి రెబ్బలు - 5
ఎండు మిరపకాయలు - 5
తాజా కొబ్బరి తురుము - 2 కప్పులు
అల్లం తురుము - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
తాలింపుకి కొబ్బరి నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టేబుల్ స్పూన్
మినప పప్పు - 1 టేబుల్ స్పూన్
చిన్న ఉల్లిపాయ ముక్కలు - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - 2 రెమ్మలు
ఎండు మిరపకాయలు - 2
నీళ్లు - చట్నీకి తగినంత

కేరళ స్టైల్ కొబ్బరి చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, ఒక చిన్న బాండీ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వంటకు వాడే కొబ్బరి నూనె వేయండి. నూనె కొద్దిగా వేడెక్కాక అందులో పొట్టు తీసిన సాంబార్ ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మీడియం మంట మీద సుమారు ఒక నిమిషం పాటు దోరగా వేయించండి.
-ఉల్లిపాయలు కాస్త రంగు మారుతున్న సమయంలో ఎండు మిరపకాయలు వేసి అవి మంచి సువాసన వస్తూ, బంగారు రంగులోకి మారే వరకు కొన్ని సెకన్ల పాటు వేయించి స్టవ్ మీద నుండి దించేయండి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో తాజా కొబ్బరి తురుము, అల్లం, రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఆ తర్వాత మనం ముందుగా నూనెలో వేయించి పెట్టుకున్న ఉల్లి, వెల్లుల్లి, మిరపకాయల మిశ్రమాన్ని కూడా అందులో వేయండి. కొద్దిగా నీళ్లు పోసుకుని, అన్నీ కలిసేలా ఒక మోస్తరు మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. ఇలా రుబ్బుకున్న చట్నీని ఒక గిన్నెలోకి మార్చుకోండి.
-చట్నీకి అసలైన రుచి తాలింపుతోనే వస్తుంది. స్టవ్ మీద తాలింపుకు కోసం చిన్న బాండీ పెట్టి, అందులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేడి చేయండి. నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత మినప పప్పు వేసి లేత బంగారు రంగులోకి మారే వరకు వేయించండి.
-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించండి. చివరగా కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి కొన్ని సెకన్ల పాటు వేయించి స్టవ్ కట్టేయండి.
-ఘుమఘుమలాడే తాలింపు మిశ్రమాన్ని గిన్నెలో ఉన్న చట్నీపై పోసి బాగా కలపండి.
-అంతే ఎంతో రుచికరమైన కేరళ స్టైల్ కొబ్బరి చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications