Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
స్నాక్స్ టైమ్ స్పెషల్..నోరూరించే కాలీఫ్లవర్ 65..క్షణాల్లో ప్లేట్ ఖాళీ చేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
సాయంత్రం వేళ పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే అమ్మా వేడి వేడిగా, కరకరలాడుతూ ఏదైనా తినాలని ఉంది అని మారాం చేస్తున్నారా? మీ ఇంట్లో కాలీఫ్లవర్ ఉంటే చాలు.. నోరూరించే, రెస్టారెంట్ స్టైల్ కాలీఫ్లవర్ 65తో వారిని ఆశ్చర్యపరచండి. చాలామందికి వచ్చే ఒకే ఒక్క సమస్య, కాలీఫ్లవర్‌కు పట్టిన మసాలా నూనెలో వేయగానే విడిపోవడం. కానీ చిన్న చిన్న చిట్కాలతో, సరైన కొలతలతో చేస్తే మసాలా పూత కొంచెం కూడా వదలకుండా ప్రతి ముక్క రుచికరంగా, కరకరలాడుతూ వస్తుంది. కరకరలాడే కాలీఫ్లవర్ 65 ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
-కాలీఫ్లవర్ - 1
-శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
-బియ్యం పిండి - 1 టేబుల్ స్పూన్
-మొక్కజొన్న పిండి (కార్న్‌ఫ్లోర్) - 2 టేబుల్ స్పూన్లు
-ఉప్పు - రుచికి సరిపడా (సుమారు 1 టీస్పూన్)
-కారం - 1 టీస్పూన్
-కాశ్మీరీ కారం - 1 టీస్పూన్
-గరం మసాలా - 1 టీస్పూన్
-అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
-నిమ్మరసం - అర చెక్క
-నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

తయారీ విధానం
-ముందుగా కాలీఫ్లవర్ ను మరీ చిన్నవిగా కాకుండా, తినడానికి వీలుగా ఉండే పూవులుగా విడదీయండి.
-ఒక గిన్నెలో వేడినీళ్లు తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసి కాలీఫ్లవర్ ముక్కలను వేసి 10 నిమిషాల పాటు ఉంచండి. దీనివల్ల అందులో ఉండే చిన్న చిన్న పురుగులు ఏవైనా ఉంటే పోతాయి, కాలీఫ్లవర్ శుభ్రపడుతుంది. తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి ముక్కలను పక్కన పెట్టుకోండి.
-తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో శనగపిండి, బియ్యంపిండి, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, కారం పొడి, కాశ్మీరీ కారం పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. ఇప్పుడు అర చెక్క నిమ్మరసం పిండి, కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ, బజ్జీల పిండి కంటే కొంచెం గట్టిగా, చిక్కటి పేస్టులా కలుపుకోవాలి.
-ఇప్పుడు నీళ్లు వడకట్టిన కాలీఫ్లవర్ ముక్కలను కలిపిన పిండిలో వేసి, ప్రతి ముక్కకు పిండి బాగా పట్టేలా చేత్తో జాగ్రత్తగా కలపాలి.
-తర్వాత బాండీలో నూనె పోసి మీడియం మంట మీద వేడిచేయండి. నూనె బాగా వేడెక్కాక మంటను కొద్దిగా తగ్గించి, మసాలా పట్టిన కాలీఫ్లవర్ ముక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వేయండి. అవి మంచి బంగారు గోధుమ రంగులోకి వచ్చి, కరకరలాడే వరకు వేయించుకుని, ఒక ప్లేట్ లోకి తీసుకోండి. అంత నోరూరించే కాలీఫ్లవర్ 65 రెడీ.
-దీనిని టొమాటో కెచప్ తో గానీ, గ్రీన్ చట్నీతో గానీ సర్వ్ చేస్తే పిల్లలు క్షణాల్లో ప్లేట్ ఖాళీ చేసేస్తారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications