Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వేడి వేడి ఇడ్లీ + కొంగునాడు చికెన్ = స్వర్గం..ఎలా చేసుకోవాలంటే..
అయితే ప్రతివారం ఒకేలాంటి చికెన్ కూర తిని బోర్ కొట్టిందా? ఎప్పుడూ చేసే మసాలా కాకుండా ఈసారి కాస్త కొత్తగా ప్రయత్నించాలనుకుంటున్నారా? అయితే కొంగునాడు స్టైల్ చికెన్ కర్రీని ఓసారి ట్రై చేయాల్సిందే.
తమిళనాడులోని కొంగు ప్రాంతపు ప్రత్యేకమైన మసాలాలతో తయారయ్యే ఈ కర్రీ.. ఇడ్లీలకే కాదు, వేడి అన్నం, దోశ, చపాతీలోకి కూడా అద్భుతంగా ఉంటుంది. కొంగునాడు స్టైల్ చికెన్ కర్రీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
అర కిలో చికెన్
4 వెల్లుల్లి రెబ్బలు 4
1 అంగుళం దాల్చిన చెక్క
2 లవంగాలు
1 చెంచా సోంపు
3 చెంచాల గసగసాలు
చిన్న అల్లం ముక్క
1 టేబుల్ స్పూన్ నూనె
1 టేబుల్ స్పూన్ మిరియాలు
అర టేబుల్ స్పూన్ జీలకర్ర
1 కట్ట కరివేపాకు
1 టేబుల్ స్పూన్ కొత్తిమీర (లేదా ధనియాలు),
3 ఎండు మిరపకాయలు
2 పెద్ద ఉల్లిపాయలు
3 టేబుల్ స్పూన్ల నూనె
అర కప్పు సాంబార్ ఉల్లిపాయలు
3 రెమ్మల కరివేపాకు
2 టమోటాలు
1 టేబుల్ స్పూన్ పసుపు
సరిపడా ఉప్ప
తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ లో అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు, గసగసాలు వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.
-స్టవ్ వెలిగించి ఒక పాన్ లో ఒక స్పూన్ నూనె వేడి చేయాలి. అందులో మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఎండు మిరపకాయలు వేసి మీడియం మంటపై ఒక నిమిషం పాటు వేయించాలి.
-అవి వేగాక అందులో తరిగిన పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి లేత బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి స్టవ్ ఆపేయాలి. ఈ మిశ్రమం చల్లారాక మిక్సీలో వేసి, కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
-ఇప్పుడు ఒక వెడల్పాటి పాన్ లేదా బాండీలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె కాగాక కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు (సాంబార్ ఉల్లిపాయలు) వేసి, ఉల్లిపాయలు గాజు రంగులోకి మారే వరకు వేయించాలి.
-తర్వాత తరిగిన టమోటాలు, పసుపు వేసి, టమోటాలు మెత్తగా గుజ్జులా అయ్యేవరకు మగ్గనివ్వాలి. టమోటాలు ఉడికాక ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం-గసగసాల పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి.
-అల్లం వెల్లుల్లి వాసన పోయాక మనం మిక్సీ పట్టుకున్న వేయించిన మసాలా పేస్ట్ (రెండవ స్టెప్) కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు శుభ్రం చేసిన చికెన్ ముక్కలను ఇందులో వేసి మసాలా ముక్కలకు పట్టేలా కలపాలి.
-ముక్కలు ఉడకడానికి సరిపడా నీరు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. మంటను మీడియం మీద ఉంచి మూత పెట్టాలి. అడుగు అంటుకోకుండా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి గరిటతో కలుపుతూ ఉండాలి.
-సుమారు 30 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చికెన్ మెత్తగా ఉడికి, నూనె పైకి తేలుతుంది. ఈ దశలో ఉప్పు సరిచూసుకుని స్టవ్ ఆపేయాలి. అంతే ఎంతో రుచికరమైన, ఘాటైన కొంగునాడు చికెన్ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications