Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కుంభకోణం స్పెషల్ కడప్ప.. ఒక్కసారి తింటే ఇడ్లీలోకి సాంబార్, చట్నీ మర్చిపోతారు!
ఇడ్లీల్లోకి మన ఇళ్లల్లో రోజువారీగా కొబ్బరి చట్నీ, కారం పొడో లేదా సాంబారో చేస్తుంటాం. కానీ ఎప్పుడూ ఒకే రకమైన రుచి అంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. అందుకే ఈసారి మీ కుటుంబ సభ్యుల కోసం ఒక స్పెషల్ సైడ్ డిష్ ట్రై చేయండి. అదే.. కుంభకోణం కడప్ప.
తమిళనాడులోని కుంభకోణం ప్రాంతంలో ఫేమస్ అయిన ఈ డిష్ రుచి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఇడ్లీ తినడానికి మారాం చేస్తుంటే ఈ కడప్పతో వడ్డించి చూడండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేయడమే కాకుండా, మళ్ళీ కావాలని అడుగుతారు. కుంభకోణం స్పెషల్ కడప్ప ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
పెసరపప్పు - పావు కప్పు
బంగాళాదుంపలు - 2
నీరు - 2 కప్పులు
పసుపు - అర టీస్పూన్
పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు
పచ్చిమిర్చి - 5
అల్లం - 2 అంగుళాల ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 7
సోంపు - 1 టీస్పూన్
గసగసాలు - 1 టీస్పూన్
జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
లవంగాలు - 3
యాలకులు - 2
బిర్యానీ ఆకు - 1
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - 1 రెబ్బ
టమోటాలు - 2
కొత్తిమీర - కొద్దిగా
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా కుక్కర్ లో నీళ్లు, పెసరపప్పు, సగం కట్ చేసిన బంగాళాదుంపలు, చిటికెడు పసుపు ,కొద్దిగా ఉప్పు వేసి మూతపెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
-తర్వాత ఉడికిన బంగాళదుంపలను తొక్క తీసి మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఉడికిన పెసరపప్పుని కూడా గరిటతో మెత్తగా మెదుపుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఒక మిక్సీ గిన్నెలో పచ్చి కొబ్బరి తురుము, వేయించిన పుట్నాల పప్పు,పచ్చిమిర్చి, తరిగిన అల్లం, వెల్లుల్లి, సోంపు గింజలు, గసగసాలు వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్సాటి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు, అనాస పువ్వు, తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, తరిగిన టమాటోలు, ఉప్పు వేసి వేయించుకోవాలి.
-తర్వాత కడాయిలో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి, కొంచెం నీళ్లు కూడా పోసి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మరిగించుకోవాలి.
-తర్వాత కడాయిలో ముందుగా ఉడికించుకున్న పప్పు మిశ్రమం వేసి కలిపి మరికొద్దిసేపు ఉడకనివ్వాలి.
-తర్వాత అందులో మెదిపిన బంగాళ దుంప వేసి మరో 10 నిమిషాలు ఉడికించాలి.
-దించేమందు కొత్తిమీర తరుగు అందులో చల్లుకొని కలపండి. అంతే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే కుంభకోణం కడప్ప రెడీ. ఇది కేవలం ఇడ్లీలోకే కాదు, దోశ, పూరీల్లోకి కూడా అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
