Latest Updates
-
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!
కుందాపుర స్టైల్ ఎగ్ గ్రేవీ..చూస్తేనే నోట్లో నీళ్లూరడం ఖాయం..ఎలా చేసుకోవాలంటే
కర్ణాటక కోస్తా తీర ప్రాంతం నుంచి వచ్చిన ఓ అద్భుతమైన వంటకం కుందాపుర కోడిగుడ్డు గ్రేవీ. కేవలం సులభంగా తయారు చేసుకోవడమే కాదు, దీని రుచి కూడా అమోఘం. వేయించిన మసాలాల ఘాటు, పచ్చి కొబ్బరి కమ్మదనం, చింతపండు పులుపుల మేళవింపుతో ఈ గ్రేవీ రుచి చూసిన వారి మనసు దోచుకోవడం ఖాయం. వేడి వేడి అన్నం, చపాతీ, దోశ.. దేనితో తిన్నా అద్భుతంగా ఉండే కుందాపుర స్టైల్ ఎగ్ గ్రేవీని మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూడండి.
కావలసిన పదార్థాలు
-కోడిగుడ్లు
-ధనియాలు
-నల్ల మిరియాలు
-జీలకర్ర
-ఎండు మిరపకాయలు (ఘాటు కోసం)
-బ్యాడ్గి ఎండు మిరపకాయలు (రంగు కోసం)
-మెంతులు
-పసుపు
-పెద్ద ఉల్లిపాయ
-పచ్చి కొబ్బరి తురుము
-రుచికి సరిపడా ఉప్పు
-వెల్లుల్లి రెబ్బలు
-చింతపండు రసం

తయారీ విధానం
-ఈ కూరకి ప్రాణం పోసే మసాలా కోసం ముందుగా బాండీలో గుంటూరు, బ్యాడ్గి ఎండు మిరపకాయలను దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలిలో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు వేసి మంచి సువాసన వచ్చేవరకు వేయించి, చల్లారనివ్వాలి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించిన దినుసులతో పాటు పసుపు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు సగం, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు రసం, పచ్చి కొబ్బరి తురుము వేసి, తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా పల్చగా ఉండాలి.
-రుబ్బిన మసాలాను ఒక గిన్నెలోకి తీసుకుని, మిగిలిన సగం ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. దీనిని ఓ మోస్తరు మంటపై మూడు నిమిషాలు ఉడకనివ్వండి.
-గ్రేవీ కొద్దిగా మరుగుతున్నప్పుడు ఉడికించిన కోడిగుడ్లను ఒక్కొక్కటిగా గ్రేవీలో జాగ్రత్తగా, ఒకదానికొకటి అంటుకోకుండా వేయాలి.
-గుడ్లు గట్టిపడటానికి, వాటిని కదపకుండా మరో మూడు నిమిషాలు ఉడికించాలి.
-చివరగా గట్టిపడిన గుడ్లను నెమ్మదిగా మరోవైపుకు తిప్పి, తక్కువ మంటపై నిమిషం పాటు ఉడికిస్తే చాలు. అంతే నోరూరించే కుందాపుర స్టైల్ కోడిగుడ్డు గ్రేవీ రెడీ. దీనిని వేడి అన్నం, నీర్ దోస లేదా చపాతీలతో వడ్డిస్తే మీ ఇంటిల్లిపాది మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు. గుడ్డు ప్రియులకు ఇదొక పండగే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
