Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కుందాపుర స్టైల్ ఎగ్ గ్రేవీ..చూస్తేనే నోట్లో నీళ్లూరడం ఖాయం..ఎలా చేసుకోవాలంటే
కర్ణాటక కోస్తా తీర ప్రాంతం నుంచి వచ్చిన ఓ అద్భుతమైన వంటకం కుందాపుర కోడిగుడ్డు గ్రేవీ. కేవలం సులభంగా తయారు చేసుకోవడమే కాదు, దీని రుచి కూడా అమోఘం. వేయించిన మసాలాల ఘాటు, పచ్చి కొబ్బరి కమ్మదనం, చింతపండు పులుపుల మేళవింపుతో ఈ గ్రేవీ రుచి చూసిన వారి మనసు దోచుకోవడం ఖాయం. వేడి వేడి అన్నం, చపాతీ, దోశ.. దేనితో తిన్నా అద్భుతంగా ఉండే కుందాపుర స్టైల్ ఎగ్ గ్రేవీని మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూడండి.
కావలసిన పదార్థాలు
-కోడిగుడ్లు
-ధనియాలు
-నల్ల మిరియాలు
-జీలకర్ర
-ఎండు మిరపకాయలు (ఘాటు కోసం)
-బ్యాడ్గి ఎండు మిరపకాయలు (రంగు కోసం)
-మెంతులు
-పసుపు
-పెద్ద ఉల్లిపాయ
-పచ్చి కొబ్బరి తురుము
-రుచికి సరిపడా ఉప్పు
-వెల్లుల్లి రెబ్బలు
-చింతపండు రసం

తయారీ విధానం
-ఈ కూరకి ప్రాణం పోసే మసాలా కోసం ముందుగా బాండీలో గుంటూరు, బ్యాడ్గి ఎండు మిరపకాయలను దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలిలో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు వేసి మంచి సువాసన వచ్చేవరకు వేయించి, చల్లారనివ్వాలి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించిన దినుసులతో పాటు పసుపు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు సగం, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు రసం, పచ్చి కొబ్బరి తురుము వేసి, తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా పల్చగా ఉండాలి.
-రుబ్బిన మసాలాను ఒక గిన్నెలోకి తీసుకుని, మిగిలిన సగం ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. దీనిని ఓ మోస్తరు మంటపై మూడు నిమిషాలు ఉడకనివ్వండి.
-గ్రేవీ కొద్దిగా మరుగుతున్నప్పుడు ఉడికించిన కోడిగుడ్లను ఒక్కొక్కటిగా గ్రేవీలో జాగ్రత్తగా, ఒకదానికొకటి అంటుకోకుండా వేయాలి.
-గుడ్లు గట్టిపడటానికి, వాటిని కదపకుండా మరో మూడు నిమిషాలు ఉడికించాలి.
-చివరగా గట్టిపడిన గుడ్లను నెమ్మదిగా మరోవైపుకు తిప్పి, తక్కువ మంటపై నిమిషం పాటు ఉడికిస్తే చాలు. అంతే నోరూరించే కుందాపుర స్టైల్ కోడిగుడ్డు గ్రేవీ రెడీ. దీనిని వేడి అన్నం, నీర్ దోస లేదా చపాతీలతో వడ్డిస్తే మీ ఇంటిల్లిపాది మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు. గుడ్డు ప్రియులకు ఇదొక పండగే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications