Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
మసాలా ఇడ్లీ ఫ్రై..ఇడ్లీ అంటేనే మొఖం తిప్పేసుకునేటోళ్లు కూడా ప్లేట్ పట్టుకొని ఎగబడతారు..ఎలా చేయాలంటే
ఇడ్లీ తినని తెలుగు వారు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు ఇళ్లల్లో,హోటల్స్ లో పొద్దున్నే చేసే బ్రేక్ ఫాస్ట్ లలో ఇడ్లీ ప్రధానమైనది. ఒక రకంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో ఉదయాన్నే ఎక్కువమంది తినే బ్రేక్ ఫాస్ట్ ఇదే. అయితే కొంతమంది ఇడ్లీ అంటేనే మొఖం తిప్పేసుకుంటారు. అలాంటివాళ్లతో ఓసారి మసాలా ఇడ్లీ టేస్ట్ చేయించాల్సిందే. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ మిగిలిపోతే దానిని మసాలా ఇడ్లీ ఫ్రైగా ఓ సారి చేసి చూడండి. టేస్ట్ అదిరిపోతుంది.
మసాలా ఇడ్లీ తయారుచేయడం కూడా చాలా చాలా ఈజీ. తక్కువ సమయంలో చేసుకోవచ్చు. పిల్లలు కూడా దీనిని చాలా ఇష్టంగా తింటారు. మిగిలిపోయిన ఇడ్లీతో..మసాలా ఇడ్లీ ఫ్రై తయారుచేయడానికి కావలసిన పదార్ధాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

మసాలా ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు
-ఇడ్లీ
-ఆయిల్
-ఆవాలు
-కరివేపాకు
-ఎండుమిర్చి
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-కారం
-ఉప్పు
-పసుపు
-గరం మసాలా
-బిర్యానీ మసాలా
-ఉల్లిపాయ తరుగు
మసాలా ఇడ్లీ తయారీ విధానం
-మసాలా ఇడ్లీ తయారుచేయడానికి ముందుగా..3 ఇడ్లీలను ఫ్రిడ్జ్ లో కనీసం అరగంటసేపు పెట్టాలి.
-అరగంట తర్వాత ఇడ్లీలను ఫ్రిడ్జ్ లో నుంచి తీసి ఇడ్లీలను ముక్కలుగా కట్ చేయాలి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి వేడి చెయ్యాలి. ఆయిల్ వేడెక్కాక అందులో ఇడ్లీ ముక్కలు వేసి బంగారు గోధుమ రంగులోకి వచ్చేదాకా వేయించి పక్కనపెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆవాలు,కరివేపాకు,2 ఎండుమిర్చి వేసి అవి వేగాక ఇందులోనే 1 ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించాలి, కొద్దిగా వేగాక ఇందులో పసుపు, కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ వేసి బాగా కలిపాలి.
-ఒక నిమిషం తర్వాత అందులో వేయించిన ఇడ్లీ ముక్కలు వేసి కలపాలి. మసాలా అంతా ఇడ్లీ ముక్కలకు పట్టేలా గరిటతో నిదానంగా తిప్పుతూ కలపాలి. అంతే టేస్టీ మసాలా ఇడ్లీ ఫ్రై రెడీ. దీనిని నచ్చిన చట్నీతో నంజుకొని తింటుంటే ఆ మజానే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications