Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
మిగిలిపోయిన అన్నంతో అదిరిపోయే ఎగ్ రైస్..మొత్తం మీరే తినేస్తారు..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే
మన ఇంట్లో అన్నం మిగిలిపోవడం అనేది చాలా కామన్ విషయం. చాలామందికి మిగిలిపోయిన అన్నాన్ని పారేయడానికి మనసొప్పదు, అలాగని మళ్లీ తినాలంటే అంత రుచిగా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో మిగిలిపోయిన అన్నాన్ని ఉపయోగించి ఎంతో రుచికరమైన, పోషక విలువలున్న ఎగ్ రైస్ తయారు చేసుకోవచ్చు. ఇది కేవలం పది నుంచి పదిహేను నిమిషాల్లో తయారవుతుంది. అంతేకాకుండా వృథాను తగ్గించడంలో ఇది ఒక మంచి మార్గం.
అప్పుడే వండిన అన్నంతో ఎగ్ రైస్ చేస్తే,అది తడిగా, జిగురుగా మారే అవకాశం ఉంటుంది. కానీ మిగిలిపోయిన అన్నం ఫ్రిజ్ లో పెట్టడం వల్ల గట్టిగా మారి, ఒక్కో మెతుకు విడివిడిగా ఉంటుంది. దీనివల్ల ఎగ్ రైస్ చేసేటప్పుడు గరిటెతో కలిపినా అన్నం మెత్తగా అవ్వకుండా, చక్కగా పొడిపొడిగా వస్తుంది. అందుకే చైనీస్ వంటకాల్లో, రెస్టారెంట్లలో కూడా మిగిలిపోయిన లేదా ఒకరోజు ముందు వండిన అన్నాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. మిగిలిపోయిన అన్నంతో మీ ఇంట్లోనే ఈజీగా ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-కోడిగుడ్లు
-కొత్తిమీర
-ఉప్పు
-కారం
-క్యారెట్
-క్యాప్సికమ్
-ఎండుమిర్చి
-పచ్చిమిర్చి
-పసుపు
-ఆవాలు
-జీలకర్ర
-కరివేపాకు
-ఉల్లిపాయ
-టమాటో
-ఆయిల్
-అన్నం
-మిరియాల పొడి

తయారీ విధానం
-స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చెయ్యండి.
-ఆయిల్ వేడయ్యాక అందులో 4 కోడిగుడ్లు కొట్టి వేసి అర నిమిషం పాటు కదపకుండా అలా వదిలేయండి. తర్వాత నెమ్మదిగా కదపండి. పెద్ద పెద్ద ముక్కలుగానే ఉండనివ్వండి.
-ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది.
-ఎగ్ మీద నురగలా ఏర్పడేటప్పుడు ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీలోనే మరో టీస్పూన్ ఆయిల్ వేసి వేడి చేశాక అందులో పావు టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు వేసి పెద్ద మంట మీద వేపాక అందులో రెండు రెబ్బల కరివేపాకు కూడా వేపాక 1 ఉల్లిపాయ తరుగు వేసి అవి మెత్తబడే దాకా మాత్రమే ఫ్రై చేయండి.
-తర్వాత అందులో రెండు పచ్చిమిరపకాయల చిన్న ముక్కలు వేసి 30 సెకన్లు మాత్రమే ఫ్రై చేయండి. తర్వాత అందులో పావు కప్పు క్యాప్సికమ్ తరుగు, పావు కప్పు క్యారెట్ తరుగు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, సరిపడా కారం వేసి టమాటో ముక్కలపై స్కిన్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేయాలి.
-ఇప్పుడు అందులో వేయించిన ఎగ్ మిశ్రమాన్ని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి.
-ఇప్పుడు అందులో 1 కప్పు(180-200 గ్రా)మిగిలిపోయిన అన్నం లేదా అప్పుడు చేసుకున్న అన్నం అయినా వేసి పెద్ద మంట మీద బాగా కలపండి.
-దించేముందు అరటీస్పూన్ మిరియాల పొడి, కొంచెం కొత్తిమీర తరుగు చల్లుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే టేస్టీ ఎగ్ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications