Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మిగిలిపోయిన అన్నంతో మెత్తని ఇడ్లీలు..ఉల్లి చట్నీతో తింటే స్వర్గమే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే
భారతీయ వంటకాల్లో ఇడ్లీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మృదువైన, తెల్లటి ఇడ్లీలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ లోకి చాలామంది వీటిని ఇష్టపడతారు. అయితే ఇడ్లీలను సాధారణంగా బియ్యప్పిండి, మినప్పప్పు కలిపి తయారు చేస్తారు. కానీ ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో కూడా అద్భుతమైన, మెత్తని ఇడ్లీలను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది కేవలం వంటలో ఒక క్రియేటివిటీ మాత్రమే కాదు, వంటగదిలో ఆహార పదార్థాలను వృథా చేయకుండా ఆదా చేయడానికి ఒక గొప్ప మార్గం కూడా. మిగిలిపోయిన అన్నంతో ఇడ్లీలను ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-మిగిలిపోయిన అన్నం
-సుజి రవ్వ
-పెరుగు
-ఉప్పు
-ఈనో
-నీళ్లు

తయారీ విధానం
-ముందుగా ఒకటిన్నర కప్పు మిగిలిపోయిన అన్నాన్ని మిక్సీ జార్ లో వేసి ఇందులోనే 1కప్పు నీళ్లు పోసి మెత్తనిపేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఈ పిండి మిశ్రమాన్ని ఓ బౌల్ లో వేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఓ పాన్ పెట్టి అందులో 1 కప్పు సుజి రవ్వ వేసి తక్కువ మంట మీద వేయించాలి.
-రవ్వ మంచి సువాన వచ్చేదాకా వేయించి దీనిని ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిమిశ్రమంలో వేసి కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత అందులో 1 కప్పు పెరుగు, అర టీస్పూన్ ఉప్పు వేసి మొత్తం అన్నీ కలిసేలా బాగా చెంచాతో కలుపుకోవాలి. 3 నిమిషాల పాటు బాగా బీట్ చేశాక దానీమీద ఓ గుడ్డ కప్పేసి 20 నిమిషాల పాటు వదిలేయండి.
-తర్వాత గుడ్డ తీసేసి పిండి మిశ్రమంలో పావు కప్పు నీళ్లు పోసి చెంచాతో బాగా కలపాలి. ఇడ్లీ పిండి మాదిరి అయ్యేదాకా బాగా కలపాలి.
-తర్వాత అందులో అర టీస్పూన్ ఈనో(fruit salt), 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి చెంచాతో నెమ్మదిగా కలపండి.
-ఇప్పుడు ఇడ్లీ ప్టేట్ లోని గుంటల్లో ఆయిల్ రాసి పిండిని అందులో నింపండి
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నీళ్లు పోసి దాంట్లో ఒక స్టాండ్ పెట్టి దానిమీద ఇడ్లీ పిండి నింపిన ప్లేట్ ని పెట్టి మూతపెట్టి 10-15 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే మెత్తని ఇడ్లీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications