Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
అమృతంలా ఉండే అల్లం నిమ్మకాయ చారు..తయారీ విధానం ఇదే
తెలుగు వారి భోజనంలో చారు లేదా రసం అనేది ఒక ముఖ్యమైన భాగం. విందు భోజనమైనా, రోజువారీ భోజనమైనా చివరలో కాస్త రసం అన్నంతో తింటేనే తృప్తిగా ఉంటుంది. సాధారణంగా మనం చింతపండు లేదా టమాటోతో రసం పెట్టుకుంటాం. కానీ చింతపండు లేకుండా కేవలం నిమ్మరసం, అల్లం ప్రధాన పదార్థాలుగా చేసుకునే చారు రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
ముఖ్యంగా చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు అల్లం నిమ్మకాయ చారు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు నోటికి రుచి తెలియకపోతే, ఈ చారు తాగితే నోటికి రుచిగా అనిపించడమే కాకుండా పొట్టకు హాయిగా ఉంటుంది. అల్లం నిమ్మకాయ చారు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
కందిపప్పు (ఉడికించినది): 2 టేబుల్ స్పూన్లు
అల్లం: 1 అంగుళాల ముక్క
నిమ్మకాయలు: 2
పచ్చిమిర్చి: 3
నీళ్లు: 2 కప్పులు
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: కొద్దిగా
కరివేపాకు: 2 రెబ్బలు
నెయ్యి: 1 టీస్పూన్
ఆవాలు: అర టీస్పూన్
జీలకర్ర: అర టీస్పూన్
ఎండుమిర్చి: 2
ఇంగువ: చిటికెడు
తయారీ విధానం
-మొదట కొద్దిగా కందిపప్పును కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించిన పప్పును బాగా మెదిపి, అందులో కొన్ని నీళ్లు పోసి పప్పు నీళ్లను పక్కన పెట్టుకోవాలి. పప్పు లేకుండా కేవలం నీళ్లతో కూడా ఈ రసం చేసుకోవచ్చు, కానీ పప్పు నీళ్లు వాడితే చారుకు మంచి చిక్కదనం, రుచి వస్తాయి.
-ఇప్పుడు అల్లంపై తొక్క తీసి దాన్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలి లేదా సన్నగా తురుముకోవాలి. పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి పెట్టుకోవాలి.
-స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 2 నుండి 3 కప్పుల నీళ్లు, దంచి పెట్టుకున్న అల్లం, చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు వేసి మీడియం మంటపై మరిగించాలి. అల్లం సారం, పచ్చిమిర్చి ఘాటు నీళ్లలోకి దిగేంత వరకు (సుమారు 5-7 నిమిషాలు) బాగా మరిగించాలి.
-ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద వేరొక చిన్న పాన్ పెట్టి అందులో ఒక టీస్పూన్ నెయ్యి వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి వేయాలి. చివరగా చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆపేయాలి.
-ఈ పోపును మరుగుతున్న చారులో వేసి వెంటనే మూత పెట్టాలి. మరో 1-2 నిమిషాలు మరిగించి స్టవ్ ఆపేయాలి.
-స్టవ్ ఆపేసిన తర్వాత, చారు కొద్దిగా వేడి తగ్గే వరకు ఆగాలి. ఇప్పుడు రెండు నిమ్మకాయల రసాన్ని పిండి, ఆ రసాన్ని చారులో కలపాలి. చారు బాగా మరుగుతున్నప్పుడు నిమ్మరసం వేస్తే, చారు చేదుగా మారే అవకాశం ఉంది. అందుకే స్టవ్ ఆపాకనే నిమ్మరసం కలపాలి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే, ఘుమఘుమలాడే వేడి వేడి అల్లం నిమ్మకాయ చారు రెడీ దీనిని వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అమృతంలా ఉంటుంది. లేదా సూప్ లాగా గ్లాసులో పోసుకుని కూడా తాగవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications