Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు!
తెలుగు వాళ్ల భోజం ప్లేట్ లో పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా కూడా గోంగూర ఎక్కడ అని చూస్తుంటారు. గోంగూరతో మనకు జన్మజన్మల బంధం. తెలంగాణలో పుంటికూరగా, ఆంధ్రాలో గోంగూరగా పిలుచుకునే ఈ ఆకుకూర కనిపిస్తే చాలు, మన నాలుకపై నీళ్లూరుతాయి. సాధారణంగా మనం గోంగూర పచ్చడి, పప్పు, లేదా నాన్ వెజ్ కాంబినేషన్స్ ఎక్కువగా చేసుకుంటాం.

కానీ ఈసారి రొటీన్ కు భిన్నంగా, నోటికి వెరైటీగా అనిపించే అదిరిపోయే గోంగూర అన్నం ట్రై చేయండి. పుల్లపుల్లగా, కారంకారంగా ఉంటూనే కమ్మటి తాలింపు వాసనతో నోరూరించే ఈ రెసిపీ..లంచ్ బాక్సుల్లోకి, వీకెండ్ స్పెషల్స్ కు, ఏదైనా ప్రత్యేక సందర్భాలకు పర్ఫెక్ట్ ఛాయిస్.
గోంగూర అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు
గోంగూర - 2 పెద్ద కట్టలు
పొడిపొడిగా వండిన అన్నం - 2 కప్పులు
పచ్చిమిర్చి - 6
ఎండుమిర్చి - 4
ధనియాలు - 1 టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
మెంతులు - పావు టీస్పూన్
వేరుశనగ గుళ్లు (పల్లీలు) - 2 టేబుల్ స్పూన్లు
పచ్చి శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
కరివేపాకు - 2 రెమ్మలు
ఇంగువ - చిటికెడు
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
నెయ్యి - 1 టీస్పూన్

గోంగూర అన్నం తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేయండి. నూనె వేడెక్కాక ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి దోరగా, కమ్మటి వాసన వచ్చేలా వేయించి పక్కన పెట్టుకోండి.
-అదే పాన్ లో మరో స్పూన్ నూనె వేసి, శుభ్రంగా కడిగిన గోంగూర ఆకులు, పచ్చిమిర్చి వేయాలి. ఆకులు పూర్తిగా మెత్తబడి, దగ్గరకు పడేవరకు ఉడికించాలి.
-ముందుగా వేయించిన మసాలా దినుసులను మిక్సీ జార్ లో వేసి పొడి చేయాలి. అందులోనే ఉడికించిన గోంగూర, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-తాలింపు కోసం ఇప్పుడు మరో మందపాటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి దోరగా వేయించాలి. పప్పులు ఎర్రగా వేగాక కరివేపాకు, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, పసుపు వేసి వేయించాలి. ఈ తాలింపులో మనం రుబ్బి పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసి కనీసం రెండు నిమిషాల పాటు నూనెలో వేగనివ్వాలి. దీనివల్ల ఆకుల్లోని పచ్చి వాసన పోయి రుచి అమాంతం పెరుగుతుంది.
-ఇప్పుడు మంటను సిమ్లో పెట్టి, ముందుగా వండి చల్లార్చిన పొడిపొడి అన్నాన్ని అందులో వేసి బాగా కలపాలి. గోంగూర మిశ్రమం ప్రతి మెతుకుకూ పట్టేలా కలుపుకున్నాక, ఉప్పు సరిచూసుకోవాలి.
-చివరగా కాస్త నెయ్యి వేసి దించితే గుమగుమలాడే గోంగూర అన్నం రెడీ. ఈ వేడివేడి గోంగూర అన్నాన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు, చల్లటి పెరుగు చట్నీతో వడ్డిస్తే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications