Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
బరువు తగ్గించే బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ప్రోటీన్ రిచ్ మఖానా సూప్
బరువు తగ్గాలనే ప్రయాణంలో చాలామందికి ఎదురయ్యే పెద్ద సవాలు ఆహారం. రోజూ తినే చప్పగా ఉండే సలాడ్లు, ఉడకబెట్టిన కూరగాయలు నాలుకకు రుచిని దూరం చేస్తాయి. దీంతో డైట్ అంటేనే ఒకరకమైన విసుగు వస్తోందా? అయితే మీ డైట్ ను బోర్ గా మార్చకుండా, దానికి రుచిని, ఆరోగ్యాన్ని జోడించే ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. అదే ప్రోటీన్ రిచ్ మఖానా సూప్.
ఫూల్ మఖానాలో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండి కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ సూప్ ను ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. అనవసరమైన చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. అంతేకాదు ఇది రోజంతా మిమ్మల్ని చురుకుగా, ఉత్సాహంగా ఉంచుతుంది.

కావాల్సిన పదార్థాలు
మఖానా - 1 కప్పు
బొంబాయి రవ్వ- అర కప్పు
నెయ్యి - 3 టీస్పూన్లు
వేరుశనగలు - పావు కప్పు
బాదం, జీడిపప్పు - ఒక్కొక్కటి 10
బంగాళాదుంప - 1
టమోటా - 1
పచ్చిమిర్చి - 2-3
అల్లం - చిన్న ముక్క
జీలకర్ర - 1 టీస్పూన్
మిరియాలు - అర టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
కరివేపాకు - ఒక రెబ్బ
నిమ్మరసం - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - 3 కప్పులు
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో బొంబాయి రవ్వ తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి 5 నిమిషాల పాటు నానబెట్టండి.
-తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి మిరియాలు, అర టీస్పూన్ టీస్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించి, చల్లారాక మెత్తని పొడిగా దంచి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు పాన్ లో 1 టీస్పూన్ నెయ్యి వేసి వేడి అయ్యాక వేరుశనగలు, బాదం, జీడిపప్పులను ఒకదాని తర్వాత ఒకటిగా వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోండి.
-అదే పాన్ లో మిగిలిన నెయ్యిలో మఖానాలను కూడా వేసి రెండు నిమిషాలు కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు సూప్ కోసం స్టవ్ పై మరో పెద్ద పాన్ పెట్టి 2 టీస్పూన్ల నెయ్యి వేయండి. నెయ్యి కరిగాక మిగిలిన అర టీస్పూన్ జీలకర్ర, తురిమిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. అవి చక్కటి సువాసన వస్తున్నప్పుడు తరిగిన బంగాళాదుంప ముక్కలు వేసి, కొద్దిగా ఉప్పు చల్లి రెండు నిమిషాలు మగ్గనివ్వండి.
-ఇప్పుడు అందులో నానబెట్టిన రవ్వను నీటితో సహా వేసి ఉండలు కట్టకుండా కలపాలి. వెంటనే 3 కప్పుల నీళ్లు, పసుపు, టమోటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి 5 నిమిషాలు మీడియం మంటపై ఉడికించండి. సూప్ కొద్దిగా చిక్కబడి, బంగాళాదుంపలు మెత్తగా ఉడికిపోతాయి.
-సూప్ సిద్ధమయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మనం వేయించి పెట్టుకున్న మఖానా, నట్స్ వేసి కలపాలి.
-చివరగా మనం సిద్ధం చేసుకున్న మిరియాలు జీలకర్ర పొడి, నిమ్మరసం పిండి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే.. వేడివేడిగా, ఘుమఘుమలాడే ప్రోటీన్ రిచ్ మఖానా సూప్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications