Latest Updates
-
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా? -
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా.. -
చేపల కన్నా 10 రెట్లు ఎక్కువ ఒమేగా-3 ఇచ్చే వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే!
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే!
సలాడ్ అనగానే చాలామందికి పెదవి విరుస్తుంటారు. అబ్బా.. ఆ పచ్చి కూరగాయలు ఎవరు తింటారు? అందులో రుచి ఏముంటుంది? అని ముఖం చిట్లిస్తుంటారు. డైటింగ్ చేసేవాళ్లు మాత్రమే బలవంతంగా సలాడ్స్ తింటారని అనుకుంటే పొరపాటే. సలాడ్ కూడా ఎంతో రుచికరంగా, కడుపు నింపేలా, నోటికి కమ్మగా ఉండేలా చేసుకోవచ్చు. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణే నల్ల శెనగలతో చేసే క్రీమీ సలాడ్.

ఇది రొటీన్ సలాడ్ లాగా చప్పగా అస్సలు ఉండదు. నల్ల శెనగల్లో ఉండే ప్రొటీన్ మన శరీరానికి అపారమైన శక్తిని ఇస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి, జిమ్ తర్వాత ప్రొటీన్ ఫుడ్ తినాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఆప్షన్. ఇందులో కూరగాయల క్రంచీనెస్, పెరుగు కమ్మదనం కలిసి ప్రతి ముద్దలోనూ ఓ కొత్త రుచిని పరిచయం చేస్తాయి.హెల్దీ అండ్ టేస్టీ నల్ల శెనగల సలాడ్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
నల్ల శెనగల సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఉడికించిన నల్ల శెనగలు - 1 కప్పు
నూనె - అర టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
కారం - మీ రుచికి సరిపడా
ఉప్పు - తగినంత
ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు
టమాటా ముక్కలు - పావు కప్పు
లెట్యూస్ లేదా క్యాబేజీ ఆకులు - గుప్పెడు
క్యారెట్ తురుము - 2 టేబుల్ స్పూన్లు
వేయించిన పల్లీలు- 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - రుచికి తగినంత
ఆలివ్ ఆయిల్ లేదా వంట నూనె- అర టీస్పూన్
వెల్లుల్లి రెబ్బ - 1
మిరియాల పొడి - రుచికి తగినంత
చిల్లీ ఫ్లేక్స్ - కొద్దిగా
ఉప్పు - చిటికెడు
కొత్తిమీర - కొద్దిగా
తాజా పెరుగు - అర కప్పు
`
నల్ల శెనగల సలాడ్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో అర టీస్పూన్ నూనె వేసి వేడి అయ్యాక, ముందుగా ఉడికించి పెట్టుకున్న నల్ల శెనగలను వేయాలి. ఇవి కాస్త కరకరలాడే వరకు కొద్ది నిమిషాల పాటు సన్నని మంటపై వేయించుకోవాలి.
-శెనగలు కాస్త రోస్ట్ అయ్యాక, అందులో జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా శెనగలకు పట్టి మంచి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆపేసి, వాటిని ఒక పెద్ద బౌల్ లోకి తీసుకోవాలి.
-శెనగలు ఉన్న ఆ బౌల్‌లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా, లెట్యూస్ ఆకులు, క్యారెట్ తురుము వేయాలి. వీటితో పాటు పంటికి క్రంచీగా తగిలేందుకు వేయించిన పల్లీలు, కొద్దిగా నిమ్మరసం పిండి కలపాలి.
-ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి తురుము, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, కొత్తిమీర వేయాలి. ఇప్పుడు ముందుగా గిలకొట్టి పెట్టుకున్న కమ్మటి పెరుగును ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ క్రీమీ పెరుగు మిశ్రమాన్ని మనం సిద్ధం చేసి పెట్టుకున్న శెనగల సలాడ్ పై పోయాలి. పెరుగు, కూరగాయలు, శెనగలు అన్నీ ఒక్కటయ్యేలా స్పూన్‌తో కిందనుంచి పైకి బాగా కలుపుకోవాలి
-అంతే ఎంతో కమ్మగా, కరకరలాడుతూ, పుల్లపుల్లగా, కారంగా తగిలే క్రీమీ నల్ల శెగనల సలాడ్ రెడీ.
-దీనిని మధ్యాహ్నం భోజనానికి బదులుగా తీసుకున్నా కడుపు నిండుగా ఉంటుంది. ఆఫీసుకెళ్లే వారు లంచ్ బాక్స్‌లో తీసుకెళ్లడానికి ఇది బెస్ట్ రెసిపీ. ఒక్కసారి ఈ సలాడ్ రుచి చూశారంటే, ఇక జీవితంలో సలాడ్ అంటే బోర్ అనే మాటే అనరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications