Latest Updates
-
వర్షాకాలంలో వీటిని మాత్రమే తింటే సరిపోదు.. బీపీ, డయాబెటిస్ రోగులకు మేలు చేసే సూపర్ ఫుడ్స్.! -
జులై 29న ‘గురు పౌర్ణమి’.. మీ గురువులను పూజించడమే కాదు.. వీటిని దానం చేస్తే ఎనలేని పుణ్యం.! -
ఇలా చేస్తే చైన్ స్మోకర్లు కూడా జన్మలో సిగరెట్ ముట్టుకోరు! -
రుచి, ఆరోగ్యం పంచే ఓట్స్ ఉప్మా..బొంబాయి రవ్వ ఉప్మా కంటే 10 రెట్లు రుచి! -
ఆఫీసులో గంటల తరబడి అలాగే కూర్చుంటున్నారా.. స్లిప్ డిస్క్‌తో వెన్నెముకకి ముప్పు తప్పదు.! -
ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు.. ఆగష్టులో ఈ రాశుల వారికి అన్నింటా రాజయోగమే.! -
చైనీస్ రుచి, ఇండియన్ ఘాటు..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చిల్లీ పనీర్ చేసుకోండిలా.. -
Beer vs Whisky: బీర్ సేఫా? విస్కీ బెటరా? మందుబాబులు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
మంత్రాల చివర్లో వచ్చే.. స్వాహా, నమః వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! -
కరీనా కపూర్ ఫేవరెట్ సూప్ ఇదే..బెలెడు ప్రయోజనాలు..ఎలా చేసుకోవాలంటే..
కండరాల పుష్టికి, బరువు తగ్గడానికి బెస్ట్..హై ప్రోటీన్ సోయా పోహా చేసుకోండిలా..
కేవలం కడుపు నింపడమే కాకుండా, శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు అందించే అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్ కోసం మీరు చూస్తున్నట్లయితే సోయా పోహా మీకు పర్ఫెక్ట్ ఛాయిస్. సాధారణంగా మనం చేసుకునే అటుకుల ఉప్మా లేదా పోహా ఉప్మాకి కొద్దిగా సోయా చంక్స్, కూరగాయలు జోడిస్తే దాని రుచి అద్భుతంగా మారడమే కాకుండా, పోషక విలువలు రెట్టింపు అవుతాయి. సోయాలో ఉండే అధిక ప్రోటీన్ కండరాల పుష్టికి సహాయపడితే, అటుకులు మిమ్మల్ని రోజంతా యాక్టివ్ గా ఉంచుతాయి.

సోయా పోహా తయారీకి కావలసిన పదార్థాలు
అటుకులు - 2 కప్పులు
సోయా చంక్స్ - 1 కప్పు
వంట నూనె - 1 టేబుల్ స్పూన్
వేరుశెనగ గుళ్లు- 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
పసుపు పొడి - పావు టీస్పూన్
ఉప్పు - సరిపడా
కరివేపాకు - రెండు రెమ్మలు
పచ్చిమిర్చి - 2 ల
ఉల్లిపాయ - 1
క్యారెట్ ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
క్యాప్సికమ్ ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
పచ్చి బఠానీలు - 2 టేబుల్ స్పూన్లు
టమాటో - 1
పాలు - 4 టేబుల్ స్పూన్లు
తాజా కొత్తిమీర - కొద్దిగా
రుచి, ఆరోగ్యం పంచే ఓట్స్ ఉప్మా..బొంబాయి రవ్వ ఉప్మా కంటే 10 రెట్లు రుచి!
సోయా పోహా తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి వేడి చేయండి. అందులో సోయా చంక్స్ వేసి 5-7 నిమిషాల పాటు ఉడకబెట్టండి. అవి మెత్తగా ఉబ్బిన తర్వాత, అందులోని నీరంతా పిండి ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోండి.
-తర్వాత అటుకులను కడగండి. నీరంతా వంపేసి, అటుకులు మెత్తబడేందుకు ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీ పెట్టుకుని అందులో నూనె వేడి చేయండి. నూనె కాగాక ముందుగా పల్లీలు వేసి, అవి లేత బంగారు రంగులోకి మారే వరకు వేయించాక అందులో ఆవాలు, జీలకర్ర వేయండి. అవి చిటపటలాడుతున్నప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొన్ని సెకన్ల పాటు వేయించాలి.
-ఆ పోపులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, పచ్చి బఠానీలు వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి. కూరగాయలు కొద్దిగా మెత్తబడ్డాక టమాటో ముక్కలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. టమాటాలు గుజ్జుగా మారేంతవరకు ఉడికించాలి.
-కూరగాయల మిశ్రమం చక్కగా ఉడికిన తర్వాత, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న సోయా చంక్స్ వేసి మసాలా అంతా వాటికి పట్టేలా బాగా కలపండి. ఆ తర్వాత నానబెట్టిన అటుకులను అందులో వేసి కలపాలి.
-పోహా మరింత మృదువుగా, కమ్మగా రావడానికి పోహా పైన 4 టేబుల్ స్పూన్ల పాలు చల్లి, మూత పెట్టి తక్కువ మంట మీద 1 లేదా 2 నిమిషాల పాటు ఉడికించండి.
-స్టవ్ ఆఫ్ చేసి, కొత్తిమీరను పైన చల్లితే సోయా పోహా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications