Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మధురై స్పెషల్ బంగాళాదుంప ఫ్రై..జన్మలో మర్చిపోలేని టేస్ట్..ఇంట్లోనే ఎలా చేయాలంటే..
మధురై అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మీనాక్షి అమ్మవారి దేవాలయం. అయితే కేవలం గుడికే కాదు, నోరూరించే అద్భుతమైన స్ట్రీట్ ఫుడ్ కి కూడా తమిళనాడులోని మధురై ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాంటి మధురై వీధుల్లో దొరికే అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాల్లో కిళంగు పొటలం(బంగాళాదుంప ఫ్రై) ఒకటి. బంగాళాదుంపతో చేసే ఎన్నో రకాల కూరలు మనం తిని ఉంటాం, కానీ దీని రుచి మాత్రం వేరే లెవెల్. ఈ కూరకి ఆ ప్రత్యేకమైన రుచి రావడానికి కారణం, వండిన తర్వాత దాన్ని పొట్లాలు కట్టడానికి వాడే విస్తరాకులో పొట్లంలా చుట్టి కాసేపు ఉంచడమే.

మధురై స్పైషల్ బంగాళదుంప ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
సోంపు - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - కొద్దిగా
ఉల్లిపాయ ముక్కలు -అర కప్పు
అల్లం-వెల్లుల్లి తరుగు - 1 టేబుల్ స్పూన్
టమాటా ముక్కలు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - అర టీస్పూన్
కారం - 1 టేబుల్ స్పూన్
ఇంగువ - అర టీస్పూన్
శెనగపిండి - అర టేబుల్ స్పూన్
పుదీనా ఆకులు - కొద్దిగా
నీళ్లు - అర కప్పు
ఉడికించిన బంగాళాదుంపలు - 5
కొత్తిమీర - గుప్పెడు
మధురై స్పైషల్ బంగాళదుంప ఫ్రై తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని, అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత అందులో సోంపు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మంచి సువాసన వచ్చేలా వేయించండి.
-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి లేత గులాబీ రంగులోకి మారి మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేంతవరకు మరో రెండు నిమిషాల పాటు దోరగా వేయించండి. ఉల్లిపాయలు బాగా మగ్గాక అందులో టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేలా ఉడికించండి.
-ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా ఇంగువ, శెనగపిండి, పుదీనా ఆకులు వేసి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మంటను సిమ్ లో ఉంచి ఉడికించాలి. శెనగపిండి పచ్చివాసన పోయి, గ్రేవీ చక్కగా చిక్కబడే వరకు నెమ్మదిగా ఉడికించుకోవాలి.
-గ్రేవీ సిద్ధమైన తర్వాత అందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలను ముక్కలుగా చేసి వేయండి. మధురై స్టైల్ రుచి, ఆకృతి రావాలంటే బంగాళాదుంపలను మరీ పెద్ద ముక్కలుగా కాకుండా గరిటెతో కాస్త చిదిమినట్లుగా కలుపుకోవాలి. మసాలా అంతా దుంపలకు బాగా పట్టేలా నిదానంగా కలపండి. సన్నని మంటపై మరో 2-3 నిమిషాల పాటు కూరను మగ్గనివ్వండి.
-చివరగా సన్నగా తరిగిన తాజా కొత్తిమీరను చల్లుకుని, ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆపేయండి.
-ఈ వంటకానికి అసలైన మ్యాజిక్ ఇప్పుడే మొదలవుతుంది. కూర వేడిగా ఉన్నప్పుడే దానిని పొట్లాలు కట్టడానికి వాడే విస్తరాకులో లేదా అరటాకులో పెట్టి ఒక పొట్లంలా మడవండి. ఇలా కాసేపు వదిలేస్తే ఆకులోని సహజమైన సువాసనలు కూరకు పడతాయి. ఈ అద్భుతమైన బంగాళాదుంప పొట్లాన్ని వేడివేడి పెరుగన్నం లేదా రసం అన్నంతో తింటే రుచి అదుర్స్ అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications