Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
కళ్లలో నీళ్లు తిరుగుతున్నా ఆపకుండా తినేంత టేస్టీ..మహారాష్ట్ర స్పెషల్ తేచ్చా చికెన్..ఈజీగా ఎలా చేయాలంటే..
తింటుంటే కళ్లలో నీళ్లు... నోరు మండిపోతున్నా సరే ఆపకుండా తినాలనిపించేంత అద్భుతమైన రుచి.. అదే తేచ్చా చికెన్ ప్రత్యేకత. మహారాష్ట్ర స్టైల్ పచ్చిమిర్చి కారం (తేచ్చా), వెల్లుల్లి ఘాటైన ఫ్లేవర్ తో తయారయ్యే ఈ చికెన్ వంటకం స్పైసీ ఫుడ్ ఇష్టపడేవారికి ఒక అద్భుతమైన వరం అని చెప్పొచ్చు. ఒక్కసారి దీని రుచి చూశారంటే, మీరు కచ్చితంగా దీనికి ఫిదా అయిపోతారు. నోరూరించే తేచ్చా చికెన్ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తేచ్చా చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు
వంట నూనె - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి (తొడిమలు తీసినవి)- 30
వెల్లుల్లి రెబ్బలు - 15
ఉప్పు - అర టీస్పూన్
కొత్తిమీర- కొద్దిగా
వేయించి పొట్టు తీసిన పల్లీలు (వేరుశెనగ గుళ్లు) - 2 టేబుల్
స్పూన్లు
బోన్ లెస్ చికెన్ (థైస్)- 500 గ్రాములు
థేచా పేస్ట్ -పావు కప్పు
ఉప్పు -అర టీస్పూన్
నిమ్మరసం - 1 టీస్పూన్
చెక్క స్కివర్స్ (పుల్లలు) - 6
ఫ్రైకి నూనె - కొద్దిగా
థేచా సాస్ తయారీకి కావాల్సినవి
నూనె - 2 టీస్పూన్లు
థేచా పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
తేనె - అర టీస్పూన్
ఉప్పు - అర టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
కార్న్‌ఫ్లోర్ మిశ్రమం - 1 టీస్పూన్
నిమ్మరసం - 1 టీస్పూన్
తేచ్చా చికెన్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ లేదా పెనం పెట్టి నూనె వేడి చేయాలి. అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించాలి. అవి కాస్త వేగాక దించి, రోలు తీసుకుని అందులో వేయించిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, కాడలతో సహా కొత్తిమీర, వేయించి పొట్టు తీసినపల్లీలు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. రోలు లేకపోతే మిక్సీలో బరకగా పట్టుకోవచ్చు. కానీ రోట్లో దంచితేనే పల్లెటూరి అసలైన రుచి వస్తుంది.
-ఒక గిన్నెలో శుభ్రం చేసిన చికెన్ థైస్ చిన్న చిన్న ముక్కలను తీసుకుని, అందులో పావు కప్పు థేచా పేస్ట్, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత చికెన్ ముక్కలను స్కివర్స్ (పుల్లల)కు గుచ్చి ఉంచుకోవాలి. మీరు ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నట్లయితే 200°C దగ్గర ప్రీ హీట్ చేసి, చికెన్ పుల్లలను అందులో పెట్టి కొద్దిగా నూనె రాసి 5-7 నిమిషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి.
-పాన్ వాడేవారైతే.. కడాయిలో కొద్దిగా నూనె వేసి తక్కువ మంటపై 7-8 నిమిషాలు చికెన్ ముక్కలను అన్ని వైపులా ఎర్రగా, క్రిస్పీగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. చల్లారాక ముక్కలను పుల్లల నుంచి తీసేయాలి.
-ఇప్పుడు ఒక పాన్ లో 2 టీస్పూన్ల నూనె వేడి చేసి అందులో 2 టేబుల్ స్పూన్ల తేచ్చా, తేనె, ఉప్పు, మిరియాల పొడి,ఇప్పుడు పావు కప్పు నీళ్లలో కలిపిన కార్న్ ఫ్లోర్ నీళ్లు, నిమ్మరసం వేసి బాగా కలుపుతూ మరిగించాలి. కార్న్ ఫ్లోర్ వేసిన వెంటనే ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. చిన్న మంట మీద 1-2 నిమిషాలు ఉడికాక, ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసి సాస్ అంతా ముక్కలకు పట్టేలా బాగా టాస్ చేయాలి.
-అంతే ఎంతో స్పైసీగా ఉండే తేచ్చా చికెన్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications