Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
Mutton Bone soup: ఎముకలకు బలం ఇచ్చే మటన్ సూప్.. సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలంటే?
మటన్ అనేది ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే వంటకం. పోషకాహారాలతో పాటు ఖనిజాలు ఇందులో పుష్కలంగా దొరుకుతాయి. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మటన్‌తో సూప్ తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడానికి ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరి రుచికి తగ్గట్టుగా, ప్రతి ఒక్కరికీ నచ్చే విధంగా ఈ మటన్ సూప్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మటన్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు
- ఎముకలు ఉన్న మటన్ ముక్కలు
- ఉల్లిపాయ
- తోటకూర
- క్యారెట్
- బీట్రూట్
- ఆవాలు
- జీలకర్ర
- దాల్చిన చెక్క
- లవంగాలు
- పసుపు
- మిరియాల పొడి
- కారం పొడి
- కొత్తిమీర
- రుచికి సరిపడా ఉప్పు
- నూనె
మటన్ సూప్ తయారీ విధానం
ఈ మటన్ సూప్ తయారు చేసుకోవడానికి ముందుగా ఎముకలు కలిగిన మటన్ ముక్కలను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడయ్యాక అందులో మటన్ ముక్కలను జత చేసుకోవాలి. అలాగే అందులోనే సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి.
ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. అందులో కొంచెం నూనె వేసుకోవాలి. అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని వేయించుకోవాలి. ఆ తరువాత అందులో పచ్చిమిర్చి, పసుపు వేసుకొని కలుపుకోవాలి.
ఆ మిశ్రమంలో ముందుగా వేయించి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసుకోవాలి. అందులోనే మిరియాలు, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఆ మిశ్రమం మొత్తం నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నాలుగు విజిల్స్ తరువాత మూత తీసి, అందులో క్యారెట్, బీట్ రూట్ ముక్కలను వేసుకోవాలి. అలాగే తోటకూర కూడా వేసుకొని మూత వేసుకొని మరో అయిదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, ఎంతో రుచికరమైన మటన్ సూప్ సిద్ధమైనట్లే.
దీనిని సూప్ మాదిరిగా తాగేయొచ్చు లేకపోతే అన్నంలో కలుపుకొని అన్నా
తినేయొచ్చు. ఎలా తిన్నా దీని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.
ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
మటన్ సూప్‌తో ఆరోగ్య ప్రయోజనాలు
ఈ మటన్ ఎముకల సూప్‌లో కొల్లాజెన్, గ్లూకోసామినోగ్లికాన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలకు కావాల్సిన బలాన్ని అందిస్తాయి. అలాగే ఎముకలను ధృడంగా మారుస్తాయి. ఎముకలకు సంబంధించిన రోగాలు కూడా నయమవుతాయి. అలాగే ఈ సూప్‌లో ఉండే విటమిన్స్ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అదే విధంగా కండరాలను బలంగా మారుస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
