Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే సైడ్ డిష్..వారం రోజుల పాటు చెడిపోని టమాటా వెల్లుల్లి తొక్కు
ప్రతిరోజూ ఉదయాన్నే ఇడ్లీ, దోశలు వేయగానే..వాటిలోకి సైడ్ డిష్ గా ఏ చట్నీ చెయ్యాలో తెలియక సతమతమవుతున్నారా? రోజూ తినే కొబ్బరి పచ్చడి, పల్లీ చట్నీ తిని బోర్ కొట్టిందా? మీరు ఒకసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉండి, పని సులభం చేసే రుచికరమైన వంటకం కోసం చూస్తున్నారా? అయితే టమాటా వెల్లుల్లి తొక్కు ట్రై చేయండి.
ఈ పచ్చడి కేవలం ఇడ్లీ, దోశలకే కాదు, వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే అమృతంలా ఉంటుంది. ఇందులో వెల్లుల్లి ఎక్కువగా వాడటం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నోరూరించే టమాటా వెల్లుల్లి తొక్కు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
టమోటాలు - 4
చింతపండు - చిన్న ఉసిరికాయ సైజులో
వెల్లుల్లి రెబ్బలు - 1 గుప్పెడు
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 3/4 టీస్పూన్
ఎండు మిరపకాయలు - 2
వెల్లుల్లి రెబ్బలు - 10
కరివేపాకు - 1 రెమ్మ
నీరు - అర కప్పు
సాధారణ కారం - 1 టీస్పూన్
కశ్మీరీ కారం - 1 టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - గార్నిష్ కోసం కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా టమాటాలను ముక్కలుగా కోసి అందులో చింతపండు వేసి మిక్సీ జార్ లో మెత్తగా పేస్ట్ లా రుబ్బుకుని పక్కన పెట్టుకోండి.
-తర్వాత అదే జార్ లో ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసి నీరు పోయకుండానే కచ్చాపచ్చాగా లేదా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు మరో 10 వెల్లుల్లి రెబ్బలు, తాజా కరివేపాకు వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి.
-ఇప్పుడు తాలింపులో ముందుగా రుబ్బి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చే వరకు సన్నని మంటపై వేయించాలి.
-వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత రుబ్బి ఉంచుకున్న టమాటా చింతపండు పేస్ట్ ను పాన్ లో వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో అర కప్పు నీరు పోసి కలపాలి.
-ఇప్పుడు ఈ మిశ్రమంలో కారం, కశ్మీరీ కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. పాన్ పై మూత పెట్టి, మీడియం మంట మీద సుమారు 5 నుండి 8 నిమిషాల పాటు ఉడికించాలి.
-మిశ్రమం నుండి నూనె పైకి తేలుతున్నప్పుడు మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే ఎంతో రుచికరమైన, ఘాటైన టమాటా వెల్లుల్లి తొక్కు రెడీ. దీనిని గాలి చొరబడని సీసాలో భద్రపరుచుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications