Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ.. కరకరలాడే బియ్యం అప్పడాలు ఎలా చేసుకోవాలంటే..
భోజనం ఎంత రుచిగా ఉన్నా, ప్లేట్ లో పక్కన కరకరలాడే అప్పడాలు లేకపోతే ఆ ముద్ద అసంపూర్ణంగానే అనిపిస్తుంది. వేడి వేడి అన్నంలో పప్పు, సాంబార్ లేదా రసం కలుపుకుని తింటున్నప్పుడు నంజుకోవడానికి క్రిస్పీగా ఉండే అప్పడం ఉంటే ఆ రుచే వేరు. మార్కెట్లో రకరకాల అప్పడాలు దొరికినప్పటికీ మన చేతులతో స్వచ్ఛంగా, ఆరోగ్యకరంగా చేసుకునే బియ్యం పిండి అప్పడాల రుచి ముందు అవన్నీ దిగదుడుపే.
ఇంట్లో తయారుచేసుకునే ఈ అప్పడాలు రుచిగా ఉండటమే కాదు, ఏడాది పాటు నిల్వ ఉంటాయి. పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరైనా ఇష్టంగా తినే ఈ అప్పడాలను తయారు చేయడం చాలా సులభం. ముఖ్యంగా తక్కువ నూనెతో, సహజమైన పదార్థాలతో చేస్తాం కాబట్టి ఆరోగ్యం పదిలం. బియ్యం పిండి అప్పడాలు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బియ్యం పిండి - 2 కప్పులు
జీలకర్ర - 1 టీస్పూన్
వాము - అర టీస్పూన్
ఎండు కారం లేదా చిల్లీ ఫ్లేక్స్ -సరిపడా
ఉప్పు - రుచికి తగినంత
నీళ్లు - పిండి కలపడానికి
నూనె - అప్పడాలు వత్తడానికి కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో బియ్యం పిండిని తీసుకోండి. అందులో రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, వాము, కొద్దిగా కారం వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు బాగా మరిగించిన వేడి నీళ్లను కొద్దికొద్దిగా పిండిలో పోస్తూ గరిటెతో కలపాలి. పిండి మరీ జారుగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండిలా మృదువుగా ఉండేలా చూసుకోవాలి.
-కలిపిన పిండి ముద్దను ఒక గిన్నెలో ఉంచి మూత పెట్టి ఇడ్లీ పాత్రలో లేదా ఆవిరి మీద ఒక 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల అప్పడాలు ఎండిన తర్వాత పగిలిపోకుండా, వేయించినప్పుడు గుల్లగా, క్రిస్పీగా వస్తాయి.
-ఆవిరి మీద ఉడికిన పిండిని బయటకు తీసి కాస్త చల్లారనివ్వాలి. చేతికి కొద్దిగా నూనె రాసుకుని పిండిని మరోసారి బాగా మెత్తగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న నిమ్మకాయ సైజు ఉండలుగా చేసుకోవాలి.
-ఇప్పుడు ఒక శుభ్రమైన ప్లాస్టిక్ కవర్ లేదా అరటి ఆకును తీసుకుని, దానికి కొంచెం నూనె రాయండి. ఒక పిండి ముద్దను దానిపై ఉంచి, మరో ప్లాస్టిక్ కవర్ తో కప్పి, చపాతీ కర్రతో లేదా అప్పడాల ప్రెస్ తో పల్చగా, గుండ్రంగా వత్తుకోవాలి.
-తయారు చేసుకున్న అప్పడాలను కాటన్ వస్త్రంపై లేదా ప్లాస్టిక్ షీట్ పై ఎండలో ఆరబెట్టాలి. రెండు, మూడు రోజుల పాటు గట్టి ఎండలో ఎండితే, అవి గలగలలాడుతూ తయారవుతాయి. తేమ లేకుండా పూర్తిగా ఎండిన తర్వాత డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
-ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఎండిన అప్పడాలను నూనెలో వేయించుకుంటే, పువ్వుల్లా విచ్చుకుని ప్లేట్ లో కరకరలాడుతూ సిద్ధమవుతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications